Rajasthan: ఆదివారం (సెప్టెంబర్ 15) తెల్లవారుజామున రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో వేగంగా వస్తున్న ట్రక్కు వ్యాన్‌ను ఢీకొనడంతో ఆరుగురు యాత్రికులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యాత్రికులు సికార్ జిల్లాలోని ఖతు శ్యామ్ ఆలయానికి వెళ్తుండగా తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
మృతులు 16 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు, మదన్ నాయక్, మంగీలాల్ నాయక్, మహేష్ నాయక్, రాజేష్, పూనమ్‌లుగా గుర్తించారు. మృతుల్లో ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
ట్రక్కు రోడ్డుకు రాంగ్ సైడ్‌లోకి వచ్చి వ్యాన్‌ను ఢీకొట్టిందని హిందోలి పోలీస్ స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్ మీనా పీటీఐకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రక్కు కోసం వేట ప్రారంభించారు.