National

Rajasthan Horror: మసీదులో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం

Rajasthan horror: 5-year-old girl raped inside mosque in Alwar, cleric arrested

Image Source : FILE PHOTO

Rajasthan Horror: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని మసీదులో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఒక మత గురువును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తన నివాసం వెలుపల ఆడుకుంటుండగా, నిందితుడు, మసీదులో మౌల్వీగా పనిచేస్తున్న 22 ఏళ్ల అస్జాద్ ఆమెను మసీదులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను వెతుక్కుంటూ ఆమె తల్లి తమ ఇంటికి ఎదురుగా ఉన్న మసీదులోకి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రాజ్‌గఢ్ రామ్‌జీలాల్ మీనా తెలిపారు.

మద్యం మత్తులో ఓ వ్యక్తి 52 ఏళ్ల తల్లిపై అత్యాచారం

బుండి జిల్లాలో మద్యం మత్తులో తన తల్లిపై అత్యాచారం చేసినందుకు 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తన 52 ఏళ్ల తల్లితో కలిసి గ్రామంలోని ఇంటికి తిరిగి వస్తుండగా ఆగస్టు 30న ఈ ఘటన జరిగింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించారు. అతడిని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తన కుమారుడితో కలిసి సోదరుడి ఇంటికి వెళ్లింది. ఇద్దరూ తిరిగి వస్తుండగా ఓ నిర్మానుష్య ప్రదేశంలో తల్లిపై అత్యాచారం చేశాడు. “మేము నిందితుడిని అరెస్టు చేసాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాం” అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) తరుంకంట్ సోమాని తెలిపారు.

Also Read : Jewellery Shop : నగల దుకాణంలో చోరీ.. కీలక నిందితుడు ఎన్కౌంటర్

Rajasthan Horror: మసీదులో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం