PMAY 2.0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) రెండవ దశను ప్రారంభించింది. ఆగస్టు 9, 2024న, పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఈ పథకాన్ని ఆమోదించింది. PMAY 2.0 కింద, ప్రభుత్వం 1 లక్ష కొత్త ఇళ్లను నిర్మించాలని యోచిస్తోంది. ఇక్కడ ప్రతి యూనిట్‌కు రూ. 2.30 లక్షల ఆర్థిక రాయితీ లభిస్తుంది.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, PMAY-అర్బన్ మునుపటి దశలో 1.18 లక్షల గృహాలు మంజూరు చేశాయి. 8.55 లక్షలకు పైగా గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. పథకం వివిధ భాగాల ద్వారా అమలు చేస్తుంది. వీటిలో:
లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం (BLC)
భాగస్వామ్యంలో సరసమైన గృహాలు (AHP)
సరసమైన అద్దె హౌసింగ్ (ARH)
వడ్డీ రాయితీ పథకం (ISS)
PMAY-U 2.0 కింద 1 లక్ష కొత్త కుటుంబాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అర్హత గల దరఖాస్తుదారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు
దరఖాస్తుదారు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు
యాక్టివ్ బ్యాంక్ ఖాతా (ఆధార్ లింక్ చేసింది)
ఆదాయ ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
భూమి పత్రాలు (సొంత భూమిలో నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేస్తే)
PMAY 2.0 కోసం దరఖాస్తు చేయాలంటే..
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://pmay-urban.gov.in కి వెళ్లండి.
అప్లికేషన్ ఎంపికను గుర్తించండి: హోమ్‌పేజీలో “Apply for PMAY-U 2.0” సింబల్ పై క్లిక్ చేయండి.
సూచనలను చదవండి: పథకం మార్గదర్శకాలను జాగ్రత్తగా పరిశీలించి, కొనసాగండి.
అర్హతను తనిఖీ చేయండి: అర్హతను ధృవీకరించడానికి వార్షిక ఆదాయంతో సహా అవసరమైన వివరాలను అందించండి.
ఆధార్ ధృవీకరణ: ధృవీకరణ కోసం మీ ఆధార్ వివరాలను నమోదు చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి: మీ చిరునామా, ఆదాయ రుజువు, ఇతర అవసరమైన వివరాలను సమర్పించండి.
ఫారమ్‌ను సమర్పించండి: ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత, దానిని సమర్పించి, మీ అప్లికేషన్ స్టేటస్ నిర్ధారణ కోసం వేచి ఉండండి.
అర్బన్ హౌసింగ్ సవాళ్లను పరిష్కరించడం, అర్హులైన పౌరులకు సరసమైన గృహాలను అందించడం ఈ పథకం లక్ష్యం. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, అధికారిక PMAY వెబ్‌సైట్‌లో వారి అప్లికేషన్ స్టేటస్ ని ట్రాక్ చేయాలని సూచించారు.