Bihar Elections: బీహార్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటిన ఎన్డీయే

NDA leads in Bihar Assembly Elections Counting crossing magic figure

NDA leads in Bihar Assembly Elections Counting crossing magic figure

Bihar Elections: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపుతో మొదటి నుంచే ముందంజలోకి వచ్చిన ఎన్డీఏ, ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైన తర్వాత మరింత వేగంగా ఆధిక్యాన్ని పెంచుకుంది.

తాజా సమాచారం ప్రకారం, మొత్తం 243 స్థానాలున్న బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 122 మ్యాజిక్‌ ఫిగర్‌ను అధికార కూటమి ఇప్పటికే దాటింది. ప్రస్తుతం ఎన్డీఏ మొత్తం 139 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ బలమైన ముందంజతో జేడీయూ-బీజేపీ కూటమి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇటువంటి ఆధిక్యంతో బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుతూ విజయోత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విపక్ష ఇండియా కూటమి 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Also Read: Bihar Elections: బిహార్ లో 2 చోట్ల MIM ఆధిక్యం

Bihar Elections: బీహార్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటిన ఎన్డీయే