Abdul Rahman Makki : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావ, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. జమాత్-ఉద్-దవా (JuD) ప్రకారం, ప్రొఫెసర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. అధిక మధుమేహం కారణంగా లాహోర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
“ఈ రోజు తెల్లవారుజామున మక్కీ గుండెపోటుకు గురయ్యాడు. అతను ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు” అని JD అధికారి PTIకి తెలిపారు. జూడి చీఫ్ హఫీజ్ సయీద్ బావ మక్కీకి ఉగ్రవాద నిరోధక కోర్టు 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జూడి డిప్యూటీ చీఫ్ మక్కీ టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో శిక్ష పడిన తర్వాత తక్కువ ప్రొఫైల్‌ను కొనసాగించారు.
మక్కీ పాకిస్థాన్ భావజాలానికి వాది అని పాకిస్థాన్ ముతాహిదా ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది. 2023లో, మక్కీని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. అతన్ని ఆస్తుల స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధం, ఆయుధాలపై నిషేధం విధించింది.
Also Read : Manmohan Singh Legacy: ఆర్థిక సలహాదారు నుంచి ప్రధాని వరకు.. ముఖ్యమైన విజయాలివే
Abdul Rahman Makki : ముంబై దాడుల సూత్రధారి కన్నుమూత