Mahakumbh: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహాకుంభ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదుల సంగమ స్థలమైన త్రివేణి సంగమంలో పూజలు చేశారు. కాషాయ రంగు జాకెట్, నీలిరంగు ట్రాక్‌ప్యాంట్ ధరించి సంగంలో పవిత్ర స్నానం చేసిన తర్వాత ఆయన పూజలు చేశారు.
VIDEO | Maha Kumbh 2025: PM Narendra Modi (@narendramodi) performs puja at Triveni Sangam in Prayagraj.
(Source: Third Party)#MahaKumbhWithPTI
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/rlWLIhyjVn
— Press Trust of India (@PTI_News) February 5, 2025
ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత, ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి యమునా నదిలో పడవ పర్యటన చేశారు. ఆయన ప్రకాశవంతమైన కాషాయ రంగు జాకెట్, నీలం రంగు ట్రాక్‌ప్యాంట్ ధరించి కనిపించారు.
పుష్య పూర్ణిమ (జనవరి 13, 2025) నాడు ప్రారంభమైన మహాకుంభ్ 2025, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమావేశం. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు మహాకుంభ్ కొనసాగుతుంది.
భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి,సంరక్షించడానికి తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి తీర్థయాత్ర స్థలాలలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పెంచడానికి నిరంతరం చురుకైన చర్యలు తీసుకుంటున్నారు.
అంతకుముందు, డిసెంబర్ 13, 2024న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించినప్పుడు, ప్రధానమంత్రి రూ. 5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. సాధారణ ప్రజలకు కనెక్టివిటీ, సౌకర్యాలు, సేవలను మెరుగుపరిచారు. అంతకుముందు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి, చారిత్రాత్మక క్షణంపై ‘రాజకీయాలు’ చేయవద్దని కోరారు.