Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన దేశాన్ని కలిచివేసింది. ఖర్గోన్ జిల్లాలో ముళ్లపొదల్లో పసికందు కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఆధారంగా ఓ వ్యక్తి శిశువును అక్కడ పడేశాడని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. గుజరాత్‌లోని రాజ్కోట్‌లో కూలీలుగా పనిచేస్తున్న సమయంలో ఆ వ్యక్తి తన 16 ఏళ్ల కూతురిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. దీనివల్లే ఆమె గర్భం దాల్చినట్లు బాధితురాలు వెల్లడించింది.
తర్వాత మధ్యప్రదేశ్‌కు తీసుకువచ్చి ఇంట్లోనే ఉంచి ప్రసవం చేయించిన నిందితుడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదని భావించి బాలిక స్పృహలో లేని సమయంలో శిశువును తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పారిపోయాడని చెప్పారు.
ప్రస్తుతం బాలికను మహిళా-శిశు సంక్షేమ కేంద్రానికి తరలించగా, శిశువును స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి డీఎన్ఏ పరీక్షలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
