Cinema, National

KBC 16: మహాభారతానికి సంబంధించిన ఈ రూ.25 లక్షల ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా?

Image Source : INSTAGRAM

Image Source : INSTAGRAM

KBC 16: సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ఇష్టమైన నాలెడ్జ్-బేస్డ్ రియాలిటీ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కొత్త సీజన్‌తో స్మాల్ స్క్రీన్‌కి తిరిగి వచ్చింది. అమితాబ్ బచ్చన్ తన శక్తివంతమైన వాయిస్‌తో 16వ సీజన్‌కు గ్రాండ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆగస్టు 12న రాత్రి 9:00 గంటలకు ప్రారంభమైంది. ‘జిందగీ హై, హర్ మోడ్ పర్ సవాల్ పూఛేగీ, జవాబ్ తో దేనా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశ్నల గోళాన్ని ప్రారంభించారు. ఆట కొత్త, పాత నియమాలు వివరించారు. ఈసారి ‘సూపర్ సవాల్’, ‘దుగ్నాస్త్ర’ అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇది పోటీదారుడు మొత్తాన్ని రెట్టింపు చేయడానికి అవకాశం ఇస్తుంది. దీంతో గేమ్ స్టార్ట్ అయ్యి మొదటి కంటెస్టెంట్ హాట్ సీట్ పై కూర్చోవడంతో అమితాబ్ బచ్చన్ ప్రశ్నల గోల మొదలుపెట్టారు.

గుజరాత్‌కు చెందిన ఉత్కర్ష్ బక్షి మొదటి పోటీదారుగా..

‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ మొదటి ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్ గుజరాత్‌కు చెందిన ఉత్కర్ష్ బక్షిని పరిచయం చేశారు. అతని ఆట చాలా బాగా సాగింది. అడిగిన అన్ని ప్రశ్నలకు అతను వేగంగా సమాధానం ఇవ్వడం కనిపించింది. లైఫ్ లైన్ సాయంతో 13వ ప్రశ్నకు చేరుకున్నాడు. అలా ఉత్కర్ష్ 12వ ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానమిచ్చాడు. కానీ అతను 13వ ప్రశ్నలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ 25 లక్షల రూపాయల ప్రశ్న ఏమిటి, దాని సరైన సమాధానం ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది మహాభారత ప్రశ్న

మహాభారతం ప్రకారం, ఏ దేవుడు అంబకు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. దాన్ని ఎవరు ధరిస్తారో వారు భీష్ముని చంపగలరని చెప్పారు?

ఎ) శివుడు

బి) కార్తికేయ దేవుడు

సి) ఇంద్రుడు

డి) వాయుదేవుడు

సరైన సమాధానం

ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఉత్కర్ష్ రెండు లైఫ్‌లైన్‌లను ఉపయోగించారు. కానీ దీని తర్వాత కూడా అతను దానికి సమాధానం ఇవ్వలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో అతని సమాధానం తప్పుగా మిగిలిపోయింది. తప్పుడు సమాధానం చెప్పడంతో వచ్చిన డబ్బు పోగొట్టుకుని కేవలం రూ.3 లక్షల 20 వేలతో ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే.. మహాభారతంలో అంబకు మాలను కానుకగా ఇచ్చిన దేవుడు కార్తికేయుడు.

Also Read: Sridevi’s Birth Anniversary : శ్రీదేవీ బర్త్ డే.. తిరుమలకు వెళ్లిన జాన్వీ

KBC 16: మహాభారతానికి సంబంధించిన ఈ రూ.25 లక్షల ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా?