Karnataka: కర్ణాటక కోలార్ జిల్లా బంగారుపేట నగరంలోని దండు రోడ్డు సమీపంలో శుక్రవారం మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. బంగారుపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “గ్రౌండ్ ఫ్లోర్ పునరుద్ధరణ సమయంలో రాజ్ కుమార్ అనే వ్యక్తికి చెందిన మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఇంట్లోని మూడు కుటుంబాలను అగ్నిమాపక దళం సిబ్బంది ఖాళీ చేయించారు.”
ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ సంభవించలేదు.