National

Firing : మద్యం దుకాణంపై కాల్పులు.. ముగ్గురు మృతి

Haryana: Three killed in firing at liquor shop on Sonipat road

Image Source : VIDEO SCREENGRAB

Firing : హర్యానాలోని సోనిపట్ రోడ్‌లోని మద్యం షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు ఈరోజు తెలిపారు. బలియానా మలుపు వద్ద సెప్టెంబర్ 19న అర్థరాత్రి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

మృతులు బోహార్ గ్రామానికి చెందిన జైదీప్, అమిత్ నందల్, వినయ్‌లుగా గుర్తించారు. గాయపడిన వారిని అనుజ్, మనోజ్‌గా గుర్తించి రోహ్‌తక్ PGIMSలోని ట్రామా సెంటర్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగంతకులు బైక్‌పై వస్తున్నారని, గ్యాంగ్ వార్ కారణంగానే కాల్పులు జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని వారు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Bigg Boss Telugu 8 : కన్ఫర్మ్ చేసిన ఫస్ట్ ఫైనలిస్ట్ పేరు లీక్

Firing : మద్యం దుకాణంపై కాల్పులు.. ముగ్గురు మృతి