National

Gurpreet Gogi : రివాల్వర్ తో కాల్చుకుని ఆప్‌ ఎమ్మెల్యే మృతి

Gurpreet Gogi, AAP's Ludhiana West MLA in Punjab, shoots himself accidentally, declared dead

Image Source : INDIA TV

Gurpreet Gogi : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి ఆదివారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకోవడంతో బుల్లెట్ గాయాలతో మృతి చెందినట్లు పంజాబ్ పోలీసు అధికారి ధృవీకరించారు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం. గోగీని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (DMC)కి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. “ఈ సంఘటన అర్ధరాత్రి జరిగింది. అతన్ని DMC ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) జస్కరన్ సింగ్ తేజా చెప్పారు.

“గురుప్రీత్ గోగిని ఆసుపత్రిలో చనిపోయినట్లు ప్రకటించారు., అతని మృతదేహాన్ని DMC ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు ప్రకారం, అతను ప్రమాదవశాత్తూ కాల్చుకున్నాడు. అతని తలకు బుల్లెట్ గాయాలు ఉన్నాయి. కారణం ఏమిటన్నది పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది’’ అని జస్కరన్ తేజ తెలిపారు.

పలు నివేదికల ప్రకారం, లూథియానా వెస్ట్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సీ గోగి తన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కాల్చుకున్నాడు. ఈ ఘటన అర్థరాత్రి చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన అతడిని డీఎంసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఆప్ నేతలు సంతాపం

గోగి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం తెలిపేందుకు లూథియానాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. “ఈ క్లిష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధాకరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read : Delhi: ఫ్లై ఓవర్ వద్ద రెండు కార్లు ఢీ.. డ్రైవర్ మృతి

Gurpreet Gogi : రివాల్వర్ తో కాల్చుకుని ఆప్‌ ఎమ్మెల్యే మృతి