Gold: దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒక్కరోజు తగ్గినట్లే తగ్గి మరుసటి రోజు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చినప్పుడల్లా నగల దుకాణాలు మహిళల రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31న బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. నిన్నటి ఉదయంతో పోల్చితే తులానికి సుమారు రూ.1,640 వరకు ఎగబాకింది.
ప్రస్తుతం ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి (ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే – రోజులో మార్పులు రావచ్చు):
-
హైదరాబాద్ – 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,04,950, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.96,200
-
ఢిల్లీ – 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,05,100, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.96,350
-
ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,04,950, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.96,200
-
బెంగళూరు – 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,04,950, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.96,200
-
చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,04,950, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.96,200
-
కోల్‌కతా – 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,04,950, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.96,200
వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. దేశంలో చాలా ప్రాంతాల్లో వెండి ధర కిలోకు రూ.1,21,000 ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాలలో మాత్రం కిలోకు రూ.1,31,000గా ఉంది. అంటే ఇతర రాష్ట్రాల కంటే దాదాపు రూ.10,000 ఎక్కువ.
బంగారం ధరల పెరుగుదల కారణాలు
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, బంగారం ధరలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో ఊహించని మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికమవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
అదనంగా, ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారం వైపు మొగ్గుచూపుతారు. దీంతో ధరలు మరింత ఎగబాకుతున్నాయి. ఇక రాబోయే పండుగల సీజన్‌లో భారత్‌లో బంగారం కొనుగోలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
