Delhi: దాదాపు రెండేళ్లుగా తప్పిపోయిన మానసిక స్థితి సరిగా లేని ఎనిమిదేళ్ల బాలుడు తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (డిసెంబర్ 4) తన కుటుంబంతో కలిశాడు. ఫిబ్రవరి 15, 2023 రాత్రి పిల్లవాడు తన ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. అతని తల్లి ఫిబ్రవరి 17న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఫిర్యాదు చేసింది.
दिल्ली पुलिस @dcp_outernorth के
N.I.A थाने की टीम ने "ऑपरेशन मिलाप" के तहत 2 साल से लापता 08 साल के बच्चे को परिवार से मिला कर परिवार की खुशियां लौटा दी,थाने में मनाया गया बच्चे का जन्मदिन….#Wecare #DPUpdates @Ravindra_IPS pic.twitter.com/pFOt65Lk0r— Delhi Police (@DelhiPolice) December 4, 2024
“ఎన్‌ఐఏ పోలీస్ స్టేషన్‌లోని మొత్తం సిబ్బంది ఈ కేసును తిరుగులేని దృఢ సంకల్పంతో కొనసాగించారు” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) నిధిన్ వల్సన్ తెలిపారు. “సమీప ప్రాంతాలు, బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, షెల్టర్ హోమ్‌లలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ సమయంలో పిల్లాడి ఆచూకీ గురించి ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు” అని డీసీపీ చెప్పారు.
బాలుడిని అతని తల్లిదండ్రులు గుర్తించారు. అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత వారితో తిరిగి కలిశారు. డిసెంబరు 3న చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఈ భావోద్వేగం చోటుచేసుకుందని, ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేశారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.