Crime: అమెరికాలో దారుణం.. కత్తితో తల నరికి భారత సంతతి వ్యక్తి హత్య

Indian man beheaded in Dallas, CCTV captures brutal attack

Indian man beheaded in Dallas, CCTV captures brutal attack

Crime: అమెరికాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని క్రూరంగా హత్య చేసిన ఘటనపై అక్కడి పోలీసులు వివరాలు వెల్లడించారు. టెక్సాస్‌లోని డాలస్ నగరంలో మోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య (50)ను అతని సహోద్యోగి కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల ప్రకారం, మోటల్‌లో పనిచేస్తున్న మార్టినెజ్ అనే ఉద్యోగి, నాగమల్లయ్యతో బుధవారం చిన్న విషయంపై వాగ్వాదానికి దిగాడు. మోటల్‌లో వాషింగ్ మెషీన్ విరిగిపోవడంతో దాన్ని వాడవద్దని మల్లయ్య సూచించాడు. కానీ ఈ విషయాన్ని ఆయన నేరుగా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగిని పంపించి చెప్పించడం మార్టినెజ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనిపై మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారింది.

ఆవేశానికి గురైన మార్టినెజ్, మల్లయ్యపై కత్తితో దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచిన తరువాత అక్కడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న మల్లయ్యను వెంటాడి, అతని తలను నరికి చెత్తకుప్పలో పడేశాడు. ఈ భయంకర దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా, విఫలమయ్యారు.

ఈ ఘటనపై భారత కాన్సులేట్ స్పందించింది. మల్లయ్య హత్య తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. బాధిత కుటుంబసభ్యులతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. నిందితుడు మార్టినెజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా తెలిపింది.

ప్రవాస భారతీయ సమాజం ఈ ఘటనతో షాక్‌కు గురైంది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు సంఘాలు మల్లయ్య కుటుంబానికి మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. ఈ సంఘటన అక్కడి భద్రతా పరిస్థితులపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Also Read: Walking: వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?

Crime: అమెరికాలో దారుణం.. కత్తితో తల నరికి భారత సంతతి వ్యక్తి హత్య