Bomb Threat : హనుమాన్‌గఢ్ జంక్షన్‌తో పాటు రాజస్థాన్‌లోని పలు రైల్వే స్టేషన్లలో బాంబు బెదిరింపులు వచ్చాయి. శ్రీ గంగానగర్, బికనీర్, జోధ్‌పూర్, కోట, బుండి, ఉదయ్‌పూర్, జైపూర్ వంటి ప్రధాన స్టేషన్లపై బాంబులు వేస్తామని బెదిరిస్తూ జైష్-ఎ-మహ్మద్ నుండి హనుమాన్‌ఘర్ స్టేషన్ కమాండర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఒక లేఖను అందించాడు.
బెదిరింపు నేపథ్యంలో, BSF, GRP, RPF సహా భద్రతా దళాలు హనుమాన్‌గఢ్ జంక్షన్‌లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. విస్తృతంగా వెతికినా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
భద్రతా తనిఖీల కోసం అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్యారేలాల్ మీనా స్టేషన్‌కు చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి లేఖ మూలాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.