Arvind Kejriwal : రేపు రాజీనామా చేయనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను కలవడానికి సోమవారం (సెప్టెంబర్ 16) అపాయింట్‌మెంట్ కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ఆదివారం (సెప్టెంబర్ 15) రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేసి దేశ రాజధానిలో ముందస్తు ఎన్నికలకు ఒత్తిడి తెస్తానని ప్రకటించారు.
ఎక్సైజ్ పాలసీ అవినీతి కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ఆదివారం నాడు తన నిజాయితీకి ప్రజలు హామీ ఇచ్చిన తర్వాతే ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటించారు.
ప్రజలు నాకు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను. మనం నిజాయితీపరులమని ప్రజలు చెప్పినప్పుడే నేను ముఖ్యమంత్రిని అవుతాను.. సిసోడియా డిప్యూటీ సీఎం అవుతారని కేజ్రీవాల్ అన్నారు.