2019 Pulwama Terror : 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో CRPF కాన్వాయ్‌పై జరిగిన ఘోరమైన ఉగ్రదాడిలో చార్జిషీట్ చేసిన 32 ఏళ్ల వ్యక్తి జమ్మూలోని ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో అధికారికంగా అభియోగాలు మోపిన 19 మందిలో కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందిన నిందితుడు బిలాల్ అహ్మద్ కుచెయ్ ఉన్నారు.
32-year-old accused in 2019 Pulwama terror attack dies of heart attack in Jammu hospital: Officials
— Press Trust of India (@PTI_News) September 24, 2024
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు సెప్టెంబర్ 17న కిష్త్వార్ జిల్లా జైలులో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. కుచేయ్ సెప్టెంబర్ 23న రాత్రి గుండెపోటుతో మరణించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆగస్టు 25, 2020న 18 మంది నిందితులతో పాటు కుచేయ్‌ను చార్జిషీట్ చేసింది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల్లో అతను కూడా ఉన్నాడు. అతను, ఇతర నిందితులు షకీర్ బషీర్, ఇన్షా జాన్, పీర్ తారిక్ అహ్మద్ షా లాజిస్టిక్స్ అందించారు. వారి ఇళ్లలో జెఎమ్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు.
రణబీర్ శిక్షాస్మృతి, ఆయుధాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, విదేశీయుల చట్టం, J&K పబ్లిక్ ప్రాపర్టీ (నష్టం నివారణ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద NIA ఛార్జిషీట్ దాఖలు చేసింది.