100 Days Of Modi 3.0: మోదీ 3.0 ప్రభుత్వం మొదటి 100 రోజులు విదేశాంగ విధానంలో కీలక దశలను చూసింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం, ‘ఆర్డర్ ఆఫ్ ఫిజీ’, తైమూర్-లెస్టే ‘ఆర్డర్ ఆఫ్ తైమూర్-లెస్టే’లతో సత్కరించారు.
ముర్ముకు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు లభించింది. ఆమె రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడింది. బలమైన, దృఢమైన, మరింత సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి ఫిజీతో భాగస్వామిగా ఉండటానికి భారతదేశం సిద్ధంగా ఉందని పేర్కొంది. “ఫిజీకి చెందిన ప్రెసిడెంట్ రతు విలియమ్ మైవలిలీ కటోనివెరే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేశారు. ఇది ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం” అని రాష్ట్రపతి కార్యాలయం X పోస్ట్‌లో పేర్కొంది.
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు గ్రాండ్-కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్-లెస్టేతో సత్కరించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ వివాద సమయంలో రష్యా మరియు ఉక్రెయిన్‌లను సందర్శించడం, ఇటలీలో జరిగిన G-7 సమ్మిట్‌లో పాల్గొనడం, రష్యా పర్యటన సందర్భంగా ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అవార్డును పొందడం వంటివి పీఎం మోదీ కీలక అంతర్జాతీయ పర్యటనల్లో ఉన్నాయి.
41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాను సందర్శించగా, 45 ఏళ్ల తర్వాత పోలాండ్‌లో పర్యటించారు. 120కి పైగా దేశాలు పాల్గొన్న మూడవ ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ సమ్మిట్‌ను భారతదేశం నిర్వహించింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశానికి తొలిసారి భారత్ ఆతిథ్యం ఇచ్చింది.