Life Style: ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పుల వల్ల చిన్న వయసులోనే ఆడపిల్లలు రజస్వల అవుతున్నారు. చాలా మంది బాలికల్లో 8 లేదా 9 ఏళ్ల వయసులోనే మొదటి రుతుచక్రం ప్రారంభమవుతోంది. సాధారణంగా 12ఏళ్లు పైబడిన తర్వాత ఆడపిల్లలు రజస్వల కావడం ఆరోగ్యకరంగా భావిస్తారు. అయితే 10 ఏళ్ల తర్వాత ఎప్పుడు ప్రారంభమైనా సాధారణంగానే తీసుకోవచ్చు. కానీ 10 సంవత్సరాల లోపే రజస్వలైతే తప్పకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది.
చిన్న వయసులోనే రజస్వల అవ్వడానికి ప్రధాన కారణాలు
జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఊబకాయం పెరగడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం. నగరాల్లో ఉన్న పిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలు శారీరక శ్రమ, బయటి వాతావరణంతో ఎక్కువగా మమేకం కావడం, సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల రజస్వల కొంచెం ఆలస్యంగా జరుగుతుంది.
10 ఏళ్ల లోపే రజస్వల అయిన పిల్లల్లో తర్వాత పీసీఓడీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇటువంటి పిల్లల్లో ఒంటరితనం, వ్యక్తిత్వ భయాలు, త్వరగా లైంగిక ఆసక్తులు కలగడం వంటి మానసిక ప్రభావాలు కూడా కనిపించవచ్చు. అందుకే ఈ వయసులో తల్లులు పిల్లలకు మరింత దగ్గరగా ఉండాలి. వారి ఆలోచనలు, ప్రవర్తన, ఫోన్లో ఏం చూస్తున్నారు వంటి విషయాలను ప్రేమతో గమనించాలి. దాదాపు నిషేధాలకంటే అవగాహన ఇవ్వడం చాలా ముఖ్యం.
ఆ సమయంలో వచ్చే నొప్పులు తగ్గించేందుకు అరటి పండు చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ముస్కుల్స్ను రిలాక్స్ చేస్తాయి. నారింజ, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు కూడా విటమిన్ C, కాల్షియంతో నొప్పులు, చిరాకును తగ్గించడంలో ఉపయోగపడతాయి. సరైన ఆహారం, వ్యాయామం, తల్లిదండ్రుల మద్దతు ఉంటే చిన్న వయసులో రజస్వల సమస్యలను తగ్గించుకోవచ్చు. పిల్లలను ఆరోగ్యంగా ఎదిగేలా మార్గనిర్దేశనం చేయవచ్చు.
Ganesh Visarjan: గణేశ్ చతుర్థి 2025 ఆగస్టు 27న దేశవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్లలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రారంభించారు. సంప్రదాయంగా గణపతి 10 రోజులు ఇళ్లలో…
Olive Oil : వెంట్రుకలు ఒకరి గుర్తింపుగా పరిగణించబడతాయి. అందువల్ల, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అత్యవసరం. సరైన ఉత్పత్తులను ఉపయోగించడం నుండి సరైన ఆహారాన్ని తినడం వరకు,…
Thyroid: థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని జీవక్రియలు మొత్తం ప్రభావితమవుతాయి. బరువు పెరగడం లేదా తగ్గడం,…