Narasimha Swamy: నరసింహస్వామి ఉగ్రరూపం ఇంట్లో ఉండవచ్చా?

what happened to keep Narasimha Swamy ugra rupa photo in home

what happened to keep Narasimha Swamy ugra rupa photo in home

Narasimha Swamy: నరసింహస్వామి ఉగ్రమూర్తి అని అందరికీ తెలుసు. అందుకే “ఇంటి వద్ద పూజించవచ్చా?”, “సింహరూపం కనుక నైవేద్యం ఎలా సమర్పించాలి?”, “పూజలు పెద్ద ఎత్తున చేయాలా?” వంటి ప్రశ్నలు భక్తుల మనసులో సహజంగానే వస్తాయి. అయితే మంత్రాలు, తంత్రాలు తెలియకపోయినా నిర్మలమైన హృదయంతో పూజిస్తే స్వామి అనుగ్రహిస్తాడు. శుచి, శుభ్రత పాటిస్తూ ఇంటినే చిన్న యాదాద్రిగా మార్చుకోవచ్చు.

ఏ దేవుడైనా భక్తులకు సులభుడే. నరసింహస్వామి కూడా అలానే! ప్రహ్లాదుడు తలచిన వెంటనే ప్రత్యక్షమై ఇలవేల్పుగా నిలిచిన స్వామి అవతార విభూతి అనేక పురాణాలలో — భాగవతం, అగ్ని, బ్రహ్మాండ, వాయు, బ్రహ్మ, విష్ణుధర్మోత్తర, కూర్మ, మత్స్య, పద్మ, శివ, లింగ, స్కంద, నృసింహ పురాణాలలో విస్తృతంగా వివరించారు. ఏ పురాణాన్ని చూసినా స్వామివారు అవతరించిన ఉద్దేశ్యం భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం అని తెలుస్తుంది. అధర్మంపై ఉగ్రరూపం చూపే స్వామి, తన భక్తుల విషయంలో మాత్రం చల్లని తండ్రిలా ఉంటాడు.

భారతదేశంలో స్వామివారు స్వయంభుగా వెలసిన క్షేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. అక్కడ స్వామి దర్శించుకుని, సన్నిధిలో నిద్రించినా కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. అయితే ప్రతిసారి క్షేత్రాలను దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇంట్లోనే విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసి నిత్యారాధన చేయవచ్చు.

విగ్రహాన్ని పెట్టాలనుకుంటే ఎత్తు మూడు నుంచి తొమ్మిది అంగుళాలకు మించకుండా చూసుకోవాలి. పూజ విధానం విషయంలో శక్తి, ఆసక్తి ఉన్నవారు పంచోపచారమో షోడశోపచారమో చేసుకోవచ్చు. మంత్రపూజ చేయలేమని భావించే వారు నిండైన మనసుతో సాదాసీదాగా అర్చన చేయవచ్చు. నారసింహ నామస్మరణ చేస్తూ నీళ్లతో అభిషేకం చేయడం, అవకాశం ఉన్న రోజు ఆవుపాలతో అభిషేకం చేయడం మంచిదే.

పూజ సమయంలో—

“నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే కమలాకాంత గృహాణార్ఘ్యం నమోస్తుతే॥”

అని పలికి నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. గంధం, కుంకుమ, పూలు, దీపం, ధూపం చూపాలి. స్వామివారికి బెల్లం పానకం, వడపప్పు ప్రీతికరమైన నైవేద్యాలు. పండ్లు కూడా నివేదించవచ్చు. ఇవన్నీ చేయలేనివారు రోజూ రెండు పూలు ఉంచి అగరొత్తులు వెలిగించినా సరిపోతుంది.

“ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్మృత్యుం నమామ్యహం॥”

ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే గ్రహబాధలు, భూతబాధలు తొలగుతాయని విశ్వాసం ఉంది. నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చేపట్టిన పనులు సఫలీకృతమవడం, సిరిసంపదలు చేకూరడం భక్తులు తరచూ అనుభవిస్తుంటారు.

Also Read: Vande Bharat: వందే భారత్ స్లీపర్.. హాట్ కేకుల్లా టికెట్లు

Narasimha Swamy: నరసింహస్వామి ఉగ్రరూపం ఇంట్లో ఉండవచ్చా?