Cancer: క్యాన్సర్ కావచ్చు.. ఈ లక్షణాలు మీకున్నాయా.. ఒకసారి చెక్ చేస్కోండి

Symptoms of Cancer You Might Be Ignoring-But Shouldn't!

Symptoms of Cancer You Might Be Ignoring-But Shouldn't!

Cancer: కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా అకస్మాత్తుగా బయటపడుతుంది. అయితే ఎక్కువగా శరీరం కొన్ని మార్పులు, లక్షణాల ద్వారా హెచ్చరికలు ఇస్తుంది. వైద్యులు ఎప్పుడూ చెబుతున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే – మీ శరీరంలో వచ్చే మార్పులను గమనించాలి.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు అకస్మాత్తుగా మొదలవ్వడం లేదా క్రమంగా ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. కొత్తగా ముద్దలు, గడ్డలు రావడం కొన్నిసార్లు క్యాన్సర్ ప్రారంభ సూచన కావచ్చు. అలాగే సాధారణ పనులు చేస్తూ ఊపిరి ఆడకపోవడం, మెట్లు ఎక్కుతుంటే అసాధారణంగా అలసిపోవడం వంటి సమస్యలు కనిపిస్తే అవి నిర్లక్ష్యం చేయకూడదు.

ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు కాకుండా ఇతర కారణాల వల్ల కూడా తగ్గొచ్చు కానీ ఇది క్రమంగా పెరుగుతుంటే పరీక్షలు చేయించుకోవాలి. రక్తస్రావం కూడా క్యాన్సర్‌కు సంబంధం ఉన్న ముఖ్యమైన లక్షణంగా పరిగణించబడుతుంది. దగ్గుతో రక్తం రావడం (హీమోప్టైసిస్), మలంలో నల్లటి లేదా టారీలా రక్తం ఉండటం, అసాధారణ యోని రక్తస్రావం, మూత్రంలో రక్తం (హీమాచూరియా), స్తనాల నుంచి రక్తపు స్రావం వంటి సమస్యలు తక్షణమే వైద్యునికి చూపించాలి.

అయితే ప్రతిసారీ ఇవన్నీ కేన్సర్ వల్లనే వస్తాయని కాదు, కానీ నిర్ధారణ కోసం వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. మింగడంలో ఇబ్బంది (డైస్ఫాజియా) కూడా నిర్లక్ష్యం చేయరానిది. ఆహారం గొంతులో ఆగిపోవడం, తినకుండానే కడుపు నిండినట్లు అనిపించడం లాంటివి కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

అలాగే మలమూత్రపు అలవాట్లలో మార్పులు కూడా జాగ్రత్తగా గమనించాలి. హఠాత్తుగా మలబద్ధకం లేదా విరేచనాలు రావడం, మూత్రం లేదా మలం వెళ్ళడంలో ఇబ్బంది కలగడం, మూత్రంలో గాలి రావడం లేదా మలం పూర్తిగా బయటకు రాలేదన్న భావన కలగడం వంటి మార్పులు కనిపిస్తే అవి కూడా వైద్యపరీక్షలకు గురి చేయాలి.

మొత్తానికి, ఈ లక్షణాలు తప్పనిసరిగా క్యాన్సర్‌నే సూచిస్తాయని కాదు, కానీ ఇవి సీరియస్ సమస్యల సూచన కావచ్చు. కాబట్టి శరీరం ఇస్తున్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.

Also Read: Snake: చెప్పుల్లోకి దూరిన పాము.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

Cancer: క్యాన్సర్ కావచ్చు.. ఈ లక్షణాలు మీకున్నాయా.. ఒకసారి చెక్ చేస్కోండి