Thyroid: ఈ లక్షణాలుంటే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి

Signs of thyroid issues: How do you know if you have them?

Signs of thyroid issues: How do you know if you have them?

Thyroid: ప్రస్తుతం అనేక రకాల అనారోగ్య సమస్యలు మనుషులను వేధిస్తున్నాయి. అలాంటి సమస్యల్లో థైరాయిడ్ ఒక ప్రధాన వ్యాధి. ఇది చిన్న సమస్యలా కనిపించినా, సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో అనేక మార్పులు దీని కారణంగా వస్తాయి.

ఉదాహరణకు బరువు ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గిపోవడం, గొంతు వద్ద వాపు రావడం థైరాయిడ్ వ్యాధికి సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ (T4), ట్రైఐయోడోథైరోనిన్ (T3) వంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి శరీరానికి అందిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియ వేగాన్ని నియంత్రించడంతో పాటు ఆహారాన్ని శక్తిగా మార్చే పనిని చేస్తాయి. గ్రంథి పనితీరు సరిగా లేకపోతే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది.

థైరాయిడ్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది:

  • హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ చర్య)

  • హైపర్ థైరాయిడిజం (అధిక థైరాయిడ్ చర్య)

ఈ రెండు పరిస్థితులలోనూ వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి.

హైపోథైరాయిడిజం లక్షణాలు: అలసట, నీరసం, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం, నిరాశ, మలబద్ధకం.

హైపర్ థైరాయిడిజం లక్షణాలు: హృదయ స్పందన వేగంగా ఉండటం, బరువు తగ్గిపోవడం, ఆందోళన, చిరాకు, విరేచనాలు, అధిక చెమట, వేడిని తట్టుకోలేకపోవడం.

ఈ రెండు పరిస్థితులలోనూ థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. అయితే హైపర్ థైరాయిడిజంలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది.

థైరాయిడ్ వ్యాధికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ చరిత్ర, అధిక అయోడిన్ కలిగిన మందులు, అయోడిన్ లేని ఉప్పు వాడకం కారణమవుతాయి. అదనంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రక్తహీనత, టైప్-1 డయాబెటిస్, సెలియాక్ వ్యాధి, అడిసన్స్ వ్యాధి, లూపస్, ఆర్థరైటిస్, స్జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా థైరాయిడ్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరం.

Also Read: Gold Rates: రాకెట్ వేగం అంటే ఇదేనేమో.. రూ.లక్షా 10 వేలకు చేరువలో బంగారం ధరలు

Thyroid: ఈ లక్షణాలుంటే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి