Coffee: ఉదయాన్నే వేడి వేడి కాఫీ పడితేనే రోజు మొదలవుతుందని భావించే వారు చాలా మంది ఉంటారు. కొందరికి అయితే రోజంతా మూడు నాలుగు కప్పుల కాఫీ తాగితేనే పని సరిగా సాగినట్లు ఫీలవుతారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మానేసినా సరే, కాఫీ మాత్రం తప్పనిసరి. కాఫీ తాగిన వెంటనే నాడీ వ్యవస్థకు ఉత్తేజం లభిస్తుందని, అందుకే శరీరంలో చురుకుదనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొందరికి కాఫీ టైమ్ మిస్ అయితే చిరాకు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక విధంగా చూస్తే కాఫీని మైల్డ్ డ్రగ్‌లా కూడా పరిగణిస్తారు.
రోజుకు 2-3 కప్పులు తాగితే ప్రయోజనాలే
కాఫీ ప్రియులకు ఇది మంచి వార్తే. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారికి గుండె సంబంధ వ్యాధులు వచ్చే శాతం తగ్గుతుందని అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన చెబుతోంది. అయితే, అతిగా కాఫీ తాగితే మాత్రం ఆరోగ్యానికి హాని ఖాయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
1000 మంది పై పరిశోధన
దాదాపు పదేళ్లుగా కాఫీ తాగే అలవాటు ఉన్న 1000 మంది మధ్య వయస్కులపై ఈ అధ్యయనం చేశారు. అందులో రోజుకు 2-3 కప్పులు తాగే వారిలో హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 5-12% తక్కువగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మరో ఓ జర్నల్ ప్రకారం ఈ ప్రమాదం సుమారు 30% వరకూ తగ్గే అవకాశం కూడా ఉందట.
కేఫినేటెడ్ కాఫీ కే బెస్ట్ రిజల్ట్స్
కేఫినేటెడ్ కాఫీ, డీకేఫినేటెడ్ కాఫీ కంటే ఆరోగ్యానికి మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డీకెఫినేటెడ్‌లో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది, అందువల్ల హృదయ పనితీరులో కొంచెం మందగింపు కనిపించిందట. అలాగే ఇన్‌స్టంట్ కాఫీ కంటే ఫిల్టర్ కాఫీ మంచి ఫలితాలు ఇస్తుందని కూడా పేర్కొన్నారు. బ్లాక్ కాఫీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని పూర్వ అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజుకు ఎంత కాఫీ సరిపోతుంది?
రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ వరకు కాఫీ తాగితే శరీరానికి హాని ఉండదట. అంటే సుమారు రోజుకు గరిష్టంగా 4 కప్పులు. అంతకంటే ఎక్కువైతే రిస్క్ పెరుగుతుంది.
గర్భిణీలు, మాతృమూర్తులు జాగ్రత్త
ప్రెగ్నెంట్ మరియు బ్రెస్ట్‌ఫీడింగ్ చేస్తున్న మహిళలు రోజుకు 200 మిల్లీగ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అంటే 2 కప్పుల కాఫీ దాటకూడదు. డాక్టర్ సలహా తీసుకుని తాగితే ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు.
అతిగా తాగితే వచ్చే సమస్యలు
రోజుకు 4 కప్పులకంటే ఎక్కువ కాఫీ తీసుకుంటే–
-
తీవ్రమైన తలనొప్పి
-
నిద్రలేమి
-
ఏకాగ్రత తగ్గడం
-
తరచుగా మూత్రం రావడం
-
గుండె వేగంగా కొట్టుకోవడం
-
కండరాల నొప్పులు
అలాంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అదనంగా, అతిగా కాఫీ రక్తపోటును పెంచుతుందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే హై బీపీ, జీర్ణ సమస్యలు, నిద్రలేమితో బాధపడేవారు కాఫీ తగ్గించడం మంచిది.
పిల్లలకు కాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు
కాఫీ తాగే పిల్లల ఎదుగుదల, అభివృద్ధి సరిగా ఉండదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వద్దు
పరగడుపున కాఫీ తాగితే కడుపు సమస్యలు, ఆమ్లత (అసిడిటీ) పెరగచ్చు.
