Chia Seeds: చియా సీడ్స్ ఎప్పుడు తీసుకుంటే బెటర్?

Morning or evening: The best time to eat chia seeds

Morning or evening: The best time to eat chia seeds

Chia Seeda: చియా సీడ్స్‌ను ఉదయం తీసుకోవాలా? లేక రాత్రి తింటే మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ ప్రశ్నకు పోషకాహార నిపుణులు స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. చియా సీడ్స్‌ను ఏ సమయంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో వారు వివరించారు. అలాగే ఆరోగ్యానికి మేలు కలిగే విధంగా వీటిని ఎలా తీసుకోవాలో కూడా సూచించారు.

త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి చియా సీడ్స్ ఒక మంచి సూపర్ ఫుడ్. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉండి, బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది. అయితే చియా సీడ్స్‌ను ఏ సమయంలో తీసుకుంటున్నామన్నది కూడా వెయిట్ లాస్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు ఏ టైమ్‌లో శరీరానికి బాగా అందుతాయో తెలుసుకోవడం అవసరం. నిజంగా చియా సీడ్స్ తీసుకునే సమయానికి, బరువు తగ్గడానికి సంబంధం ఉందా? ఉంటే అది ఎలా పనిచేస్తుందనే విషయాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

చియా సీడ్స్‌లో ఫైబర్‌తో పాటు ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. చూడడానికి చిన్నగా కనిపించే ఈ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గించడం నుంచి మెటబాలిజాన్ని మెరుగుపరచే వరకు ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని ఉదయం తీసుకోవాలా లేదా రాత్రి తినాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఏ సమయంలో తీసుకుంటే మంచిదన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

ఉదయం తీసుకుంటే కలిగే లాభాలు:
ఉదయమే చియా సీడ్స్ తీసుకోవడం వల్ల రోజు ఎంతో చురుగ్గా ప్రారంభమవుతుంది. నీటిలో నానబెట్టుకుని లేదా స్మూతీస్‌లో కలిపి తీసుకుంటే మంచిది. ఇలా తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆకలి తగ్గి, మధ్య మధ్యలో తినే అలవాటు తగ్గుతుంది. దీని వల్ల బరువు వేగంగా తగ్గేందుకు సహాయపడుతుంది. అలాగే ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో మలవిసర్జన సులువుగా జరుగుతుంది. రోజంతా ఎనర్జీగా, యాక్టివ్‌గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

రాత్రి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు:
చాలామందికి రాత్రి వేళ ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది. భోజనం చేసినా మళ్లీ ఏదో తినాలనే కోరిక కలుగుతుంది. రాత్రి పూట చియా సీడ్స్ తీసుకుంటే ఈ లేట్ నైట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అనారోగ్యకరమైన ఆకలి తగ్గి, పొట్ట చుట్టూ కొవ్వు పెరగకుండా ఉంటుంది. దీంతో బరువు సులువుగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి తీసుకున్న చియా సీడ్స్‌లోని ఫైబర్ నిద్ర సమయంలో బాగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరుసటి రోజు ఉదయం మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. అతిగా తినడాన్ని నియంత్రించాలనుకునేవారు రాత్రి స్మాల్ మీల్‌తో పాటు చియా సీడ్స్ తీసుకుంటే మంచిది.

చియా సీడ్స్ ఎలా తీసుకోవాలి:
చియా సీడ్స్‌ను నేరుగా నీటిలో వేసి వెంటనే తాగకూడదు. ముందుగా ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి కనీసం అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పరగడుపున తాగితే మంచిది. యోగర్ట్ లేదా స్మూతీస్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. వీటిలో కొవ్వు శాతం కొంచెం ఎక్కువగా ఉండటంతో స్మాల్ మీల్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది. గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలనుకుంటే రాత్రి పూట తీసుకోవడం ఉత్తమం. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

ఎప్పుడు తీసుకుంటే బెటర్?
చియా సీడ్స్‌ను ఎప్పుడు తీసుకోవాలన్నదానికి ఒకే సరైన సమయం ఉందని చెప్పలేము. తీసుకునే టైమ్‌ను బట్టి ప్రయోజనాలు మారుతాయి. ఎక్కువ తినకుండా ఆకలిని నియంత్రించాలంటే ఉదయం తీసుకోవచ్చు. హాయిగా నిద్ర పడాలి, మలబద్ధకం తగ్గాలంటే రాత్రి పూట తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ టైమ్‌లో తీసుకుంటేనే బరువు తగ్గుతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఏ సమయమైనా సరే, రెగ్యులర్‌గా సరైన మోతాదులో తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. దీనితో పాటు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం.

గమనిక:
ఇది సాధారణ సమాచారమే. ఇది ఎలాంటి మందులకు లేదా వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. చియా సీడ్స్‌ను ఆహారంలో చేర్చేముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ సమాచార ఖచ్చితత్వం, ప్రభావానికి పూర్తిగా బాధ్యత వహించదు.

Also Read: Data Privacy: ‘మాల్స్‌లో మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు’

Chia Seeds: చియా సీడ్స్ ఎప్పుడు తీసుకుంటే బెటర్?