Pregnancy: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు అవసరం. కొందరు గర్భిణీలు అలవాటు లేదా ఇష్టంతో రోజుకు 2–3 సార్లు టీ తాగుతుంటారు.
కానీ ఈ సమయంలో టీ, కాఫీ రెండింటిలోనూ ఉండే కెఫిన్‌ను మితంగా మాత్రమే తీసుకోవాలని గైనకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదు, అంటే రెండు కప్పుల కంటే ఎక్కువ టీ తాగరాదు.
టీ అధికంగా తాగితే గర్భంలోని శిశువు పెరుగుదల మందగించడం, నెలలు నిండకముందే ప్రసవం జరగడం లేదా గర్భస్రావం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉండే కారణంగా, టీ పరిమాణంపై మీ వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
అలాగే, టీ ఎక్కువగా తాగడం వలన గర్భిణీలకు నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల గర్భధారణ సమయంలో కెఫిన్‌ను పరిమితంగా తీసుకోవడం, అవసరమైతే టీని పూర్తిగా మానేయడం మంచిది.
