Health: గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

Could it be high cholesterol? Signs on hands and legs to pay attention to

Could it be high cholesterol? Signs on hands and legs to pay attention to

Health: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉన్నప్పుడు దాని ప్రభావం కేవలం గుండె లేదా రక్తనాళాలకే కాకుండా గోళ్ల రూపంలో కూడా కనిపించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్యమైన వ్యక్తుల గోళ్లు లేత గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటాయి. కానీ రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే ఈ సహజ రంగు మారిపోతుంది.

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో గోళ్లు పాలిపోయినట్టు లేదా తెల్లగా కనిపించడం ఒక ప్రధాన లక్షణం. రక్తం సరైన మోతాదులో గోళ్లకు చేరకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొందరిలో గోళ్లపై పొడవుగా గాట్లు ఏర్పడతాయి. దీనిని వైద్య భాషలో ‘ఒనికోరెక్సిస్’ అని పిలుస్తారు. ఇవి గోళ్లను బలహీనంగా చేసి సులభంగా విరిగేలా చేస్తాయి.

అలాగే రక్త ప్రవాహం తగ్గడం వల్ల గోళ్ల పెరుగుదల కూడా మందగిస్తుంది. సాధారణంగా వేగంగా పెరగాల్సిన గోళ్లు ఎక్కువ సమయం తీసుకుంటాయి. కొందరిలో గోళ్లు సరిగా కాకుండా ఒంకరగా, వంకరగా పెరుగుతాయి. ఇది లోపలి ఆరోగ్య సమస్యకు సంకేతంగా పరిగణించవచ్చు.

మరికొందరిలో గోళ్ల రంగు నీలం లేదా ఊదా ఛాయలోకి మారడం కూడా గమనించవచ్చు. ఇది ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు కనిపించే లక్షణం. ఈ మార్పులన్నీ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. గోళ్లలో వచ్చే ఈ చిన్న మార్పులే కొలెస్ట్రాల్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యను ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, వైద్యుల సలహా పాటించడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు.

Also Read: Tamannaah: మైసూర్ శాండల్ అంబాసిడర్ గా నార్త్ బ్యూటీనా?

Health: గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్