19. పుల్లగా.. కారంగా.. “మామిడి గుత్తివంకాయ కూర- Gutti Vankaya

Gutti Vankaya curry with Mango కావలసిన పదార్థాలు : వంకాయలు… 250 గ్రా. పచ్చి మామిడి… ఒకటి పచ్చిమిర్చి… 30 గ్రా. అల్లం… చిన్న ముక్క జీలకర్ర… అర టీ. వెలుల్లి…10 రేకలు పసుపు… అర టీ. కొత్తిమీర… ఒక కట్ట కరివేపాకు… 2 రెమ్మలు ఉల్లిపాయ… ఒకటి ధనియాలు… ఒక టీ. ఉప్పు… సరిపడా రిఫైండ్ ఆయిల్… సరిపడా తయారీ విధానం : ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిలను రుబ్బుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి. పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడికాయ వేసి కలపాలి. బాగా ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకుతో అలంకరించుకుని దింపేయాలి. ఈ కూర వేడి వేడి అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. Originally posted 2010-01-22 05:40:00.

18 .అజీర్ణానికి చెక్ పెట్టే “మెంతి టొమోటో కర్రీ

కావలసిన పదార్థాలు : టొమోటోలు.. పావు కేజీ మెంతికూర.. ఒక కప్పు కొబ్బరికోరు.. ఒక టీఉల్లిపాయ.. ఒకటి కారం.. ఒక టీ. ఉప్పు.. తగినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ. నూనె.. ఒక టీ. ధనియాలపొడి.. ఒక టీ. కరివేపాకు.. రెండు రెబ్బలు కొత్తిమీర.. తగినంత జీలకర్ర, ఆవాలు.. ఒక టీ. తయారీ విధానం : కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి. శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి. అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి, చివర్నో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మెంతి టొమోటో కర్రీ తయార్.! దీన్ని వేడి వేడి అన్నంలోగానీ, చపాతీల్లోగానీ కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా.. Originally posted 2009-12-19 09:37:00.

11. చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌ “పన్నీర్ కుర్మా

కావలసిన పదార్థాలు:పన్నీర్… ఒక కప్పుతెల్లగడ్డలు… నాలుగుఅల్లం… రెండు చిన్న ముక్కలుకారం… అర టీస్పూన్గరం మసాలా… ఒక టీ.నెయ్యి… రెండు టీ.ఉల్లిపాయ… ఒకటిపెరుగు… ఒక కప్పుపచ్చిమిర్చి… రెండుధనియాల పొడి… అర టీ.ఉప్పు… తగినంత తయారీ విధానం :ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు నిమిషాలసేపు ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తరువాత కొత్తిమీర తరుగులను చేర్చి దించేయాలి. ఈ కుర్మాను చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌గా సర్వ్ చేయొచ్చు. Originally posted 2009-12-18 10:55:00.

10. షుగర్ వ్యాధిగ్రస్తులకు “అరటి కాండం పచ్చడి

 కావలసిన పదార్థాలు :   అరటి కాండం… 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)నిమ్మకాయలు… 15 కాయలుఎండు మిరపకాయలు… 50 గ్రా.ఆవాలు… 50 గ్రా.పెరుగు… 250 మిలీపసుపు… 5 గ్రా.ఉప్పు… 25 గ్రా.కరివేపాకు… సరిపడాపోపుదినుసులు… సరిపడాతయారీ విధానం :  ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.  ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి మంచిది. అంతేగాకుండా ఇది దోసె, చపాతీలకు కూడా భలే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. Originally posted 2009-12-18 10:53:00.

9. స్థూలకాయన్ని తగ్గించే పపయాసాస్‌

 కావలసిన పదార్థాలు :బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీపంచదార.. పావు కేజీసోడియం బెన్‌టోజ్.. ఒక టీ.సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.గరంమసాలా.. 5 గ్రా.లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత తయారీ విధానం :ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తరువాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలోపోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని పంచదార పాకంలో వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి కలియబెట్టాలి.ఈ మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత దించి తగినంత ఉప్పు, సోడియం బెన్‌టోజ్, సిట్రిక్ యాసిడ్, మిగిలిన పంచదారనును వేసి బాగా కలియబెట్టి, మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అంతే పపయా సాస్ రెడీ. వారం రోజులదాకా నిల్వ ఉండే ఈసాస్‌ను బ్రెడ్‌తో కలిపి తినవచ్చు. ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకూ, ఆదర్శభోజనం తీసుకునే వారికీ, స్థూలకాయులకూ Read More …

Leta mokha jonnala Curry

  Leta mokha jonnala Curry కావలసిన పదార్థాలు : పచ్చిమిర్చి తరుగు… రెండు టీ. వెన్న… రెండు టీ. జీరాపొడి… ఒక టీ. ధనియాల పొడి… ఒక టీ. కొత్తిమీర… పావు కప్పు లేత మొక్కజొన్న గింజలు… ఒక కప్పు మిరియాల పొడి… అర టీ. నూనె… తగినంత ఉప్పు… సరిపడా టమోటో జ్యూస్… ఒక కప్పు తయారీ విధానం : బాణలి వేడయ్యాక నూనె, వెన్న వేసి కాగిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఆపై ఉడికించిన లేత మొక్కజొన్న గింజలు‌, జీరా, ధనియాలపొడి, మిరియాల పొడి, ఉప్పు, టమాటో జ్యూస్‌ను కలిపి వేయించాలి. తగినంత నీటిని పోసి గ్రేవీ దగ్గరకు వచ్చేలా ఉడికించాలి. తరువాత కిందికి దించి కొత్తిమీర పైన చల్లి, అతిథులకు వడ్డించాలి. ఈ మొక్కజొన్న గింజల కర్రీని చపాతీలకు, వేడి వేడి అన్నానికి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు. Christian Louboutin Boots Louboutin pumps sale online store,the newest style and best service you can get! Free&fast delivery without any sale tax, enjoy shopping now! Read More …

7. Cocktail Idly

ఇడ్లీ పిండి – ఆరు కప్పులు, ఉడక పెట్టిన బఠానీలు – ఒక కప్పు,కేరెట్ తురుము-ఒక కప్పు ,సనగాతరిగిన కొతిమీర  -ఒక కప్పు  ,నూనె-రెండు గరిటెలు ,జీలకర్ర పొడి -రెండు చెంచాలు ,పసుపు -ఆఫ్ చెంచా ,ఉప్పు -సరిపడా ,ఆవాలు -రెండు చెంచాలు ,ఇంగువ -చిటికెడు తయారీ విధానం :ఒక మినప పప్పు కొలతకి రెండింతలు  ఇడ్లీ రవ్వ తీసుకొండి .ఇడ్లీ పిండి తయారు  చేసు కోవాలి .దానికి ఉప్పు కలిపి నాలుగుగంటలు నాన నివ్వాలి .ఇపుడు ఇడ్లీ పిండి   ఆరు కప్పులు తీసుకుని  దానికి జీలకర్ర పొడి ,పసుపు ,కొత్తిమీర కలిపి ప్లేట్లకి నూనె రాసి గుంటలతో మూడింతలు  పిండి వేసి దాని మీద క్యారెట్ తురుము , బఠానీలుచల్లాలి .ఇడ్లీ లను 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తరవాత ఇడ్లీలను తీసి 4 నుంచి 6 ముక్కలుగా కోసుకోవాలి.బాండీలో నూనె వేసి 2 గరిటెలు, నూనె కాగిన తరవాత ఆవాలు, ఇంగువ వేసి చిటపటలాడిన తరవాత కట్ చేసి ఉంచుకున్న ఇడ్లి ముక్కలు బాండీలో వేసి రెండు నిమిషాలు వేయించి వేడి వేడి గా సర్వ్ చెయ్యాలి.చిన్న ఇడ్లి చేసుకునే ప్లేటు ఉంటె Read More …

అరటి కాయ పొడి కూర

కావలసిన పదార్ధాలుఅరటి కాయలు – రెండు (ఉడకపెట్టి పేస్టు చేసుకుని ఉంచుకోవాలి).( Plantain)ఉల్లి పాయలు – రెండుకొబ్బరి తురుము, ఉప్పు , – తగినంతపోపు గింజలు – మినప పప్పు, ఆవాలు. జీలకర్ర ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె — తగినపచ్చి తయారు చేసే విధానముముందుగ బాండలి పెట్టి రెండు స్పూన్స్ నూనె పోయాలి .వేడి ఎక్కాక పోపుగింజలు వేయాలి .కొద్దిగా ఉల్లిపాయలు   వేయాలి. కొంచెం  వేగాక సన్నగా తరిగిన పచ్చి మిర్చి వెయ్యాలి. కొత్తిమీర కరివేపాకు వెయ్యాలి. తరవాత కొంచెం కొబ్బరి తురుము   వేసి అన్ని దోరగా వేగాక, అరటికాయ పేస్టు కూడా వేసుకుని బాగా కలిసేలా కలపాలి.  Originally posted 2009-10-22 03:05:00.

BANANA STEM CURRY

కావలసిన పదార్దములు:బనానా స్టెం  (అరటి దవ్వ/దూట )సెనగపప్పు ఒక స్పూన్మినప పప్పు అర స్పూన్ఆవాలు అర స్పూన్ఎండుమిర్చి రెండు (ముక్కలు గా  చెయ్యాలి)కరివేపాకు ఒక రెమ్మఉప్పు తగినంతకొంచం చింతపండు గుజ్జునూనె ఒక స్పూన్అర స్పూన్ ఆవాలు  నూ రిన ముద్దకొంచెం ఇంగువతయారుచేసే విధానంఅరటి దవ్వ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొంచం పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపిన నీళ్ళలో ఉడికించాలి. నీళ్ళను వంచేసి, ముక్కలు కొంచం పిడుచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. మూకుడు లో ఒక స్పూన్ నునే వేసి అందులో సెనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. పోపువేగాక ఉడికించిన  ముక్కలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి రెండు మూడు నిముషాలు ముక్కలకి పులుపు బాగా అంటేలా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవాల  పేస్టు కలిపాలి. ఒకటి రెండు గంటలు తర్వాత బాగా ఊరుతుంది కాబట్టి టేస్టు బాగుంటుంది. బనానా స్టెం లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాల మంచిది. నూనె  కూడా తక్కువ పడుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే  వారికీ బాగుంటుంది. Originally Read More …

Vankaya Kura

కావలసిన పదార్థాలు :చిన్న వంకాయలు- 1/2 కిలోటమోటాలు 1/4 కిలోఉల్లిపాయలు 1/4 కిలోపచ్చి పప్పు 1/4 కప్పుధనియాలు – 1/4 కప్పుపుట్నాల పప్పు- 1/4 కప్పునువ్వులు – 1/4 కప్పుశనగ గుండ్లు 1/2 కప్పునూనె – 1/4 కప్పుఎండు మిర్చి- తగినన్నిఉప్పు – రుచికి సరిపడపోపు గింజలు – 1 టీ స్పూన్పసుపు – కొద్దిగాకొత్తిమీర కట్ట – ఒకటి తయారుచేయు విధానం :ముందుగా కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి శనగ గుండ్లు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులను వేరువేరుగా వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలో పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద పేస్టులాగా ఉడకనివ్వాలి. తర్వాత వంకాయల్ని అడ్డంగా, నిలువుగా (గుత్తి వంకాయల్లాగానే) కోసి స్టవ్ మీద ఉన్న కూరలో వెయ్యాలి. ఇప్పుడు ఆ గిన్నెలో రెండు గ్లాసుల Read More …