Curd During Periods: పిరియడ్స్ సమయంలో పెరుగు తినొచ్చా? అపోహా..? నిజమా..?

Curd During Periods

Curd During Periods: మహిళల్లో రుతుస్రావం (Periods) అనేది ప్రతి నెలా జరిగే సహజమైన శారీరక ప్రక్రియే. అయితే, ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవద్దు అన్న విషయాలపై సమాజంలో ఎన్నో అపోహలు, ప్రచారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పిరియడ్స్ సమయంలో పెరుగు(Curd During Periods) తినొద్దు” అని చాలా మంది అంటుంటారు. పెరుగు తింటే రక్తం గడ్డకడుతుందని, కడుపునొప్పి లేదా బ్లీడింగ్ ఎక్కువవుతుందని చెబుతుంటారు. మరి అదంతా నిజమేనా… ఒట్టి అపోహేనా.. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటీ.. ఈ విషయంపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు అన్న విషయానికొస్తే..

1. పిరియడ్స్ సమయంలో పెరుగు తినొచ్చా?

వైద్య శాస్త్రం ప్రకారం, పిరియడ్స్ సమయంలో పెరుగు ధైర్యంగా తినవచ్చు. పెరుగు చలువ చేస్తుంది. అంతేకాదు, రుతుస్రావం సమయంలో శరీరం కోల్పోయే అనేక పోషకాలను తిరిగి అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అపోహ మాత్రమే

పెరుగు తినడం వల్ల బ్లీడింగ్ ఎక్కువవడం లేదా కడుపునొప్పి రావడం అనేది కేవలం ఒక అపోహ (Myth) మాత్రమే. నిజానికి పెరుగులోని పోషకాలు పీరియడ్స్ నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి.

Eating curd during periods

2. పిరియడ్స్ లో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పీరియడ్స్ సమయంలో పెరుగును మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి:

క్యాల్షియం లోపం నివారణ:

  • పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు తీవ్రమైన నడుము నొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. పెరుగులో పుష్కలంగా ఉండే క్యాల్షియం (Calcium) కండరాల పట్టేతత్వాన్ని (Cramps) తగ్గించి, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కడుపు ఉబ్బరం & గ్యాస్ సమస్యలకు చెక్:

  • ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరం (Bloating) లేదా మలబద్ధకం ఏర్పడతాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ (Good Bacteria) జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.

మూడ్ స్వింగ్స్ (Mood Swings) నింత్రణ:

  • పిరియడ్స్ టైమ్‌లో చిరాకు, కోపం, ఆందోళన వంటి మూడ్ స్వింగ్స్ సాధారణం. పెరుగులోని క్యాల్షియం మరియు మెగ్నీషియం మెదడును ప్రశాంతపరిచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇన్ఫెక్షన్ల నివారణ:

  • రుతుస్రావం సమయంలో యోని (Vagina) వద్ద బాక్టీరియల్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పెరుగులోని మంచి బాక్టీరియా సహజమైన ఇన్ఫెక్షన్ నిరోధకంగా పనిచేస్తుంది.

Eat Curd during periods

3. పెరుగు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం:

జాగ్రత్తలు అనుసరించాల్సిన విధానం
ఫ్రిజ్ పెరుగు వాడకూడదు ఫ్రిజ్ నుంచి నేరుగా తీసిన చల్లటి పెరుగును తినడం వల్ల కొంతమందిలో గొంతు నొప్పి లేదా తిమ్మిరి రావచ్చు. తోడుపెట్టిన తాజా పెరుగును వాడటం మంచిది.
రాత్రి వేళల్లో నివారించండి పిరియడ్స్ సమయంలో జలుబు, దగ్గు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కాకుండా ఉదయం, మధ్యాహ్నం పూట తినడం శ్రేయస్కరం.
అతిగా తినకూడదు రోజుకు ఒక చిన్న కప్పు (150-200 గ్రాములు) పెరుగు లేదా మజ్జిగ రూపంలో తీసుకోవడం సరిపోతుంది.

మూఢనమ్మకం

మొత్తానికి పిరియడ్స్ సమయంలో పెరుగు తినడం పూర్తిగా సురక్షితం, ఆరోగ్యదాయకం. పాతకాలపు మూఢనమ్మకాలను పక్కనబెట్టండి. పీరియడ్స్ సమయంలో శరీరానికి అవసరమైన క్యాల్షియం, ప్రోబయోటిక్స్ పొందడానికి తాజా పెరుగు లేదా మజ్జిగను నిరభ్యంతరంగా తీసుకోండి. అయితే చల్లటి ఫ్రిజ్ పెరుగుకు దూరంగా ఉంటూ, తాజా పదార్థాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.

Also Read: Rocket Crashes Moon: చందమామను రాకెట్ ఢీకొంటే ఏమవుతుంది? సైన్స్ చెప్పే విస్తుపోయే విషయాలు!