TS TET Result 2026: టెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్

TS TET Result 2026 OUT @tgtet.aptonline.in/tgtet Live Updates: Check TSTET Qualifying Marks Here

TS TET Result 2026 OUT @tgtet.aptonline.in/tgtet Live Updates: Check TSTET Qualifying Marks Here

TS TET Result 2026: తెలంగాణ టెట్‌–2026 ఫలితాలను (TG TET 2026 Results) పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఈ టెట్ పరీక్షల ఫలితాలను మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు, అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీతో పాటు ఫలితాలను తాజాగా వెబ్‌సైట్‌లో ఉంచారు.

టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

అభ్యర్థులు తమ జర్నల్ నంబర్ లేదా హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి, సంబంధిత పేపర్‌ను ఎంపిక చేసుకుని, పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే టెట్ ఫైనల్ కీ కూడా అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.

ఈసారి టెట్ పేపర్–1, పేపర్–2లకు కలిపి మొత్తం 2.37 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 71,670 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. టెట్ పరీక్షకు మొత్తం 1,95,181 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 65,605 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఫలితాల పరంగా చూస్తే, మొత్తం 1,00,270 మంది అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధించారు. ఇది మొత్తం హాజరైన వారిలో 51.37 శాతం. వీరిలో 37,893 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఉండగా, వారి ఉత్తీర్ణత శాతం 57.76గా నమోదైంది. టెట్ ఫలితాలు మరియు తుది కీ విడుదల కావడంతో అభ్యర్థులు తమ అర్హత స్థితిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

టెట్ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి

Also Read: గెలిపించండని ఏడ్చిన BJP అభ్యర్థి.. VIDEO VIRAL

TS TET Result 2026: టెట్ రిజల్ట్స్ వచ్చేశాయ్