TG Inter Exams: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2026 ఫిబ్రవరి చివరి వారంలో పరీక్షలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన టైమ్‌టేబుల్ ఫైల్‌ను ఇంటర్ బోర్డు సీఎం రేవంత్ రెడ్డికు పంపినట్లు తెలుస్తోంది. అధికార వర్గాల ప్రకారం, సీఎం ఇప్పటికే దీనికి ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం JEE మెయిన్, ఎమ్సెట్ వంటి ప్రధాన ప్రవేశ పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను ముందుకు జరిపింది. గతంలో కంటే ఈసారి పరీక్షలు కొంత ముందుగానే ప్రారంభమవుతాయి.
తాజా షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.
అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాల బోర్డులు దాదాపు సమాన సమయానికి పరీక్షలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
