Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన 434 పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువు ఎల్లుండితో (సెప్టెంబర్ 18) ముగియనుంది. ఈ నియామకాల్లో నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్ట్, టెక్నీషియన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసి ఉండాలి. గరిష్ఠంగా 40 సంవత్సరాల లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి పోస్టుకు వయోపరిమితి, అర్హతలు కొద్దిగా మారవచ్చు కాబట్టి అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించడం మంచిది.
ఈ నియామకాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹21,700 నుంచి ₹44,900 వరకు జీతం అందజేయనున్నారు. పోస్టు రకం, స్థాయి ఆధారంగా జీతభత్యాల్లో తేడాలు ఉంటాయి. అదనంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు లభించే ఇతర సౌకర్యాలు కూడా వర్తిస్తాయి.
ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా రేపటిలోపు దరఖాస్తు సమర్పించాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవరు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
దరఖాస్తు, అర్హతలు, పరీక్షా విధానం తదితర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/
