DRDO: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని 764 టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ (జనవరి 11, 2026). ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
పోస్ట్ వివరాలు:
-
సంస్థ: DRDO
-
మొత్తం ఖాళీలు: 764
-
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B) – 561 పోస్టులు
-
టెక్నీషియన్-ఏ (Tech-A) – 203 పోస్టులు
-
ముఖ్య తేదీలు:
-
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 9, 2025
-
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 11, 2026
-
అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 13, 2026
-
అధికారిక సైట్: drdo.gov.in
అర్హతలు:
-
STA-B: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఎస్సీ డిగ్రీ లేదా డిప్లోమా ఉండాలి
-
Tech-A: 10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు సంబంధిత ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి
-
వయోపరిమితి: జనవరి 1, 2026 నాటికి 18 – 28 సంవత్సరాలు
(రిజర్వ్ అభ్యర్థులకు నియమాల ప్రకారం వయో పరిమితి సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం:
ఎంపిక టైర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పోస్టు ఆధారంగా తర్వాత టైర్-2 స్కిల్/ప్రాక్టికల్/ట్రేడ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం, అర్హతలు, పరీక్ష విధానం, ఇతర నిబంధనల కోసం అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మంచిది.
