Inter: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యార్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల కోసం హాల్ టికెట్లను ఇవాళ అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
విద్యార్థులు తమ ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలతో https://bie.ap.gov.in/ వెబ్సైట్‌లో లాగిన్ అయ్యి హాల్ టికెట్లు పొందవచ్చు. అదేవిధంగా ‘మన మిత్ర’ సేవా నంబర్ 9552300009 ద్వారా కూడా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులోని విద్యార్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం పేరు, తేదీలు సరిగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. ఏదైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని కూడా సూచించారు.
Also Read: Viral: వైభవంగా ధనుష్, మృణాల్ పెళ్లి!
Inter: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
