Allu Arjun: వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్

Why Is Allu Arjun’s Mobile Wallpaper Trending, and Why Is March 27, 2026 on It? Here’s the Full Story

Why Is Allu Arjun’s Mobile Wallpaper Trending, and Why Is March 27, 2026 on It? Here’s the Full Story

Allu Arjun: అల్లు అర్జున్ ఫోన్ వాల్‌పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వాల్‌పేపర్‌లో March 27, 2026 అనే తేదీతో పాటు No Snack, No Sugar, No Soda అనే పదాలు కనిపించడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఆ పదాల కింద ఆయన కుమారుడు అయాన్ పేరును కూడా టైప్ చేసి ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో కలిసి తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కొత్త ప్రపంచాన్ని చూపించబోతోందని చెప్పబడుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణే కీలక పాత్రలో నటించడం ఈ చిత్రానికి మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది.

ఇటీవల అల్లు అర్జున్ వ్యక్తిగత జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలోనే ఈ వాల్‌పేపర్ బయటపడింది. దీని తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ సోదరుడు అల్లుశిరీష్ ఇటీవల నైనికాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నందున, వారి వివాహం మార్చి 27న జరిగే అవకాశముందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇక No Snack, No Sugar, No Soda అనే పదాలపై కూడా వేర్వేరు అర్థాలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Also Read: Ramayana: ‘రామాయణం’ నాటక ప్రదర్శనల్లో అశ్లీల నృత్యాలు

Allu Arjun: వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్