Allu Arjun: 42 రూల్స్ వివాదం.. సీరియస్ అయిన AA టీమ్

Team Allu Arjun Slams Podcast For List Of '42 Dos And Don'ts' Before Meeting Actor

Team Allu Arjun Slams Podcast For List Of '42 Dos And Don'ts' Before Meeting Actor

Allu Arjun: టాలీవుడ్‌లో స్టైల్‌, డ్యాన్స్‌, యాక్టింగ్‌ అన్నింటిలోనూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రయాణం స్ఫూర్తిదాయకమైనదే. తొలి చిత్రం ‘గంగోత్రి’తో లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న బన్నీ, కాలక్రమంలో తనను తాను మార్చుకుంటూ ‘పుష్ప’ సిరీస్‌తో స్టైల్ ఐకాన్‌గా పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు, ప్రముఖ నిర్మాత కుమారుడైనా.. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొని తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సిద్ధాంతాన్ని అల్లు అర్జున్ ఎప్పుడూ పాటిస్తారని అభిమానులు చెబుతుంటారు. సినీ ఇండస్ట్రీలోనే కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులతోనూ ఆయన ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. ఫ్యాన్స్ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉన్న బన్నీ, ఇటీవల నిర్వహించిన అభిమానుల సమావేశంలో కూడా ఎలాంటి స్టార్ ఆర్భాటాలు చూపలేదని ప్రశంసలు అందుకున్నారు. అలాంటి అల్లు అర్జున్‌పై ఒక్కసారిగా ‘ప్రోటోకాల్’ అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం రూపొందించిన ఈ ప్రోటోకాల్‌లో.. ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్ హ్యాండ్ చేయకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదు, మధ్యలో కదలకూడదు వంటి నియమాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. దీంతో నెటిజన్లు సెటైర్లు వేయడమే కాకుండా, కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని ట్రోలింగ్‌కు ఉపయోగించుకున్నారు.

ఈ ఆరోపణలకు కారణం రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు తమకు 42 నిబంధనల జాబితా ఇచ్చారని, మేనేజర్లను దాటి వెళ్లాల్సి వచ్చిందని, ఫొటోషూట్ సమయంలో కూడా కఠిన నియమాలు ఉన్నాయని ఆమె చెప్పడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఇమేజ్‌పై అనేక సందేహాలు మొదలయ్యాయి.

ఈ వివాదం ముదరడంతో అల్లు అర్జున్ టీమ్ అధికారికంగా స్పందిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. “అల్లు అర్జున్‌పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆయన అందరితో గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఈ తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులపై పరువు నష్టం కేసు వేయడానికి లీగల్ టీమ్ సిద్ధంగా ఉంది. నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దు” అని స్పష్టం చేసింది. ఈ వివరణతో అయినా రూమర్లు ఆగుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాల కంటే ఒక వైరల్ వీడియో కారణంగా అల్లు అర్జున్ వార్తల్లో నిలవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Weather: బాబోయ్.. ఈ సారి ఎండలంటే ఎండలు

Allu Arjun: 42 రూల్స్ వివాదం.. సీరియస్ అయిన AA టీమ్