Sreeleela: శ్రీలీల కాదు.. ఇకపై డాక్టర్ శ్రీలీల!

Sreeleela Officially Completes MBBS, Becomes a Doctor

Sreeleela: టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల తన జీవితంలో మరో గొప్ప మైలురాయిని విజయవంతంగా చేరుకుంది. వెండితెరపై నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్‌గా గుర్తింపు పొందింది. మెడికల్ చదువును విజయవంతంగా పూర్తి చేసి ఎంబీబీఎస్ డిగ్రీ సాధించిన శ్రీలీల, ఇటీవల జరిగిన కాన్వొకేషన్ వేడుకలో మెడిసిన్ పట్టాను అందుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి శ్రీలీలకు వైద్య వృత్తిపై ఆసక్తి చిన్నతనంలోనే మొదలైంది. ఆమె తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత గారే తనకు ప్రధాన ప్రేరణగా నిలిచారు. అంతేకాదు, చిన్న వయసులోనే తన అమ్మమ్మ అనారోగ్యంతో బాధపడిన సందర్భాలు, ఒక వైద్యురాలిగా సేవ చేయాలన్న కోరికను ఆమె మనసులో బలంగా నాటాయి. ఆ లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా చదువును కొనసాగించింది.

SreeLeela | నటి నుంచి డాక్టర్‌గా.. మెడిసిన్ పట్టా అందుకున్న టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల

గత ఏడాది శ్రీలీల సినిమాల పరంగా ఎంతో బిజీగా గడిపింది. చేతినిండా ప్రాజెక్టులతో షూటింగ్‌లలో పాల్గొంటూనే, చదువుపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రోజంతా షూటింగ్‌లతో అలసిపోయినా, దొరికిన ప్రతి విరామ సమయంలో పుస్తకాలు తెరిచి చదవడం ఆమె అలవాటు. నటనతో పాటు మెడికల్ చదువును సమతుల్యంగా కొనసాగించడం అంత సులువు కాకపోయినా, పట్టుదలతో ముందుకెళ్లింది.

ఆమె చేసిన శ్రమకు నేడు తగిన ఫలితం దక్కింది. డాక్టర్ శ్రీలీలగా మారి తన కలను నిజం చేసుకుంది. నటిగా మాత్రమే కాదు, వైద్యురాలిగా కూడా సేవ చేయాలన్న ఆమె ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. సినీ రంగంలో విజయాలు సాధిస్తూనే, చదువును నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చని శ్రీలీల మరోసారి నిరూపించారు.

Also Read: Jobs: టెన్త్ అర్హతతో జాబ్స్.. నెలకు రూ.18వేల పైనే జీతం

Sreeleela: శ్రీలీల కాదు.. ఇకపై డాక్టర్ శ్రీలీల!