Samantha: నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో (Raj Nidimoru) డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలకు మరింత బలం చేకూరేలా, సమంత ఈ దీపావళిని రాజ్ నిడిమోరు కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. రాజ్ కుటుంబంతో సమంత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాణసంచా కాలుస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ, “నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది” అనే క్యాప్షన్‌ను ఆమె జోడించారు. తరచూ వీరిద్దరూ కలిసి కనిపించడం వల్ల నెటిజన్లలో ఆసక్తి మరింత పెరిగింది.
Samantha: మరోసారి సమంత అతనితో ఉన్న ఫొటోలు వైరల్
Samantha celebrates Diwali With Raj Nidimoru and family, festive pics surface
