Rashmika Mandanna: రూమర్స్ పై రష్మిక పాజిటివ్ రిప్లై

Rashmika Mandanna addressed ongoing rumors on her

Rashmika Mandanna addressed ongoing rumors on her

Rashmika Mandanna: వరుస సినిమాలతో పాటు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులతో ఎప్పుడూ కనెక్ట్‌గా ఉండే నటి రష్మిక (Rashmika) ఇటీవల అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. తనపై వచ్చిన రూమర్స్‌, సినిమాల ఎంపిక, అలాగే ఇండస్ట్రీ అనుభవాల గురించి పంచుకున్నారు.

“2016 నుండి ఇప్పటివరకు నేను ఒకే విధంగా పనిచేస్తున్నాను. ఎలాంటి భాషా హద్దులు లేకుండా భిన్నమైన కథలను ఎంచుకోవాలని నాకిష్టం. ఇదే కొనసాగించాలనుకుంటున్నాను. నేను హీరోయిన్ని, ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం నా పని. అందుకే కమర్షియల్‌, లవ్ స్టోరీలు, స్త్రీ ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఇలా అన్ని రకాల చిత్రాల్లో నటించడానికి ఓకే చెబుతాను. కొందరికి ప్రేమ కథలు ఇష్టం, మరికొందరికి కమర్షియల్‌. అందరి కోసం వైవిధ్యమైన సబ్జెక్ట్‌లను చేస్తూనే ఉంటాను” అని రష్మిక అన్నారు.

మరొక ప్రశ్నకు స్పందిస్తూ ఆమె నెగెటివిటీ గురించి కూడా మాట్లాడారు. “వ్యూస్ కోసం నెగెటివ్‌గా రాయడం, రూమర్లు స్ప్రెడ్ చేయడం చాలా కామన్‌. వాళ్లకు నాపై కోపం ఉండొచ్చు, దానికి ఇంకాస్త జోడించి రాస్తారు. నిజంగా చెప్పాలంటే ఆ వార్తలు కూడా చాలా మందిని పోషిస్తున్నాయి. వాళ్లను కూడా బతకనీ అని వదిలేస్తా. ఇండస్ట్రీలో ఉన్న వారిపై నెగెటివిటీ సాధారణం. అందుకే ఎవరి గురించి అయినా వార్తలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రోజు ప్రజలకు నిజం తెలుస్తుంది అని నమ్ముతా. ముందు అయితే అలాంటివి విని చాలా బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నా. జీవితం ప్రతి అనుభవం నుంచి నేర్పిస్తూనే ఉంటుంది” అని చెప్పారు.

ఇక పారితోషికంపై వస్తున్న రూమర్‌ గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. “ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునేది నేనే అని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహ. నేనేం హీరోను కాదు ఎక్కువ తీసుకునేందుకు. అదేమైనా నిజం అయితే బాగుండేది, నేనూ ఎదురు చూస్తున్నా” అని నవ్వుతూ చెప్పింది.

అలాగే ప్రత్యేక పాటల (స్పెషల్ సాంగ్) గురించి మాట్లాడుతూ — “నేను స్పెషల్ పాటల్లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ఆ సినిమాలో నేనే హీరోయిన్‌గా ఉండాలి. లేకపోతే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారు, వాళ్లు అడిగితే లీడ్ రోల్ కాకపోయినా వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్‌ చేస్తా” అని తెలిపారు. అయితే ఆ దర్శకుల పేర్లు మాత్రం వెల్లడించలేదు.

Also Read: Suprem Court: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం బిగ్ షాక్

Rashmika Mandanna: రూమర్స్ పై రష్మిక పాజిటివ్ రిప్లై