Ram Gopal Varma: చిరంజీవికి థాంక్స్.. క్షమాపణలు: RGV

Ram Gopal Varma Issues Apology to Chiranjeevi Prior to Shiva's Re-Release

Ram Gopal Varma Issues Apology to Chiranjeevi Prior to Shiva's Re-Release

Ram Gopal Varma: టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక కారణంతో హాట్‌ టాపిక్‌గా మారే దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో వర్మ మరోసారి మీడియా దృష్టికి కేంద్రంగా మారాడు. నవంబర్ 14న ఈ సినిమా తిరిగి థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టాలీవుడ్‌ స్టార్ హీరోలు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోలను విడుదల చేస్తూ వర్మకు, శివ సినిమాకు మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. శివ చిత్రం తొలిసారి తాను చూసినప్పుడు తెలుగు సినిమా ప్రపంచం పూర్తిగా మారిపోయిందనే భావన కలిగిందని చిరంజీవి తెలిపారు. ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త దారుల్లోకి తీసుకెళ్లిన విప్లవాత్మక చిత్రం అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలోని ప్రసిద్ధ సైకిల్‌ చైన్ సీన్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందని, నాగార్జున ప్రదర్శన, ఎనర్జీ సినిమా హైలైట్స్‌గా నిలిచాయని అన్నారు. అమల, రఘువరన్‌తో పాటు ప్రతి నటుడు తమ పాత్రలకు న్యాయం చేశారని ఆయన ప్రశంసించారు. ఈ సినిమా రీ–రిలీజ్ అవుతుండటం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు.

ఇదిలా ఉండగా, చిరంజీవి ఇచ్చిన ఈ మద్దతుకు రాంగోపాల్ వర్మ స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా “థాంక్యూ చిరంజీవి గారు. ఆ సందర్భంలో మీకు నేను చెప్పిన మాటల వల్ల లేదా నా చేతల వల్ల మిమ్మల్ని బాధపెట్టినట్లయితే నిష్కపటంగా క్షమాపణలు కోరుతున్నాను. మీలాంటి పెద్ద మనసుకు ధన్యవాదాలు” అని రాశారు. ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్‌పై వర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా గతంలో కొంత ఉద్రిక్తత ఏర్పడినా, ఈసారి చిరంజీవి గొడవలు పట్టించుకోకుండా సినిమాలోని విలువను గుర్తించి శుభాకాంక్షలు తెలియజేయడంతో వర్మ ఈ స్పందన ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Rea: Ayyappa: అయ్యప్ప దీక్షలో నలుపు దుస్తులే ఎందుకు?

Ram Gopal Varma: చిరంజీవికి థాంక్స్.. క్షమాపణలు: RGV