Ram Charan: చెర్రీ-ఉపాసనల పిల్లల పేర్లు ఇవే..!

కొణిదెల రామ్‌ చరణ్‌–ఉపాసన కొణిదెల దంపతుల కుటుంబంలో మరోసారి సంతోషం వెల్లివిరిసింది. ఇటీవల జన్మించిన కవల పిల్లలకు మెగా కుటుంబం సంప్రదాయబద్ధంగా నామకరణోత్సవం నిర్వహించింది. ఈ వేడుకను కుటుంబ పెద్ద మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆచారాలు, సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు.

రామ్‌ చరణ్‌–ఉపాసన దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. నామకరణ వేడుకలో కుమారుడికి “శివ్‌రామ్ కొణిదెల”, కుమార్తెకు “అన్వీరా దేవి కొణిదెల” అనే పేర్లు నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో చర్చించి, భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించేలా ఈ పేర్లు ఎంపిక చేసినట్లు రామ్‌ చరణ్‌ తెలిపారు.

కుమారుడి పేరులో శివుడు, రాముడు అనే రెండు దైవాల లక్షణాలు కలిసేలా “శివ్‌రామ్” అని పేరు పెట్టినట్లు ఆయన వివరించారు. అలాగే తన తండ్రి చిరంజీవి అసలు పేరు “శివ శంకర వర ప్రసాద్”లోని “శివ్” అనే పదాన్ని మనవడి పేరులో చేర్చడం ఎంతో ప్రత్యేకమని చెప్పారు.

కుమార్తెకు పెట్టిన “అన్వీరా దేవి” అనే పేరుకు హద్దులు లేని ధైర్యం, దైవత్వం అనే అర్థాలు ఉన్నాయని రామ్‌ చరణ్‌ తెలిపారు. “వీర” అంటే ధైర్యం, “అన్” అంటే హద్దులు లేనిది, “దేవి” అంటే దైవ స్వరూపం అని వివరించారు. పిల్లల పేర్లు వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసి ధైర్యం, ప్రేమ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని తమ ఆకాంక్షగా పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన అంతర్జాతీయ పత్రిక వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. హిందూ సంప్రదాయాల్లో అన్వీరా దేవిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆమెను ఏకవీరా దేవి లేదా రేణుకా దేవి రూపంగా పూజిస్తారు.

ఇక రామ్‌ చరణ్‌ సినీ ప్రయాణం విషయానికి వస్తే, బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Viral: ఆన్‌లైన్‌లో వేప పుల్లలు.. రూ.2వేల పైనే!

Ram Charan: చెర్రీ-ఉపాసనల పిల్లల పేర్లు ఇవే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *