Rajinikanth: తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘తలైవర్ 173’ అనే పేరు పెట్టారు. రజనీకాంత్ కెరీర్‌లో ఇది 173వ సినిమా కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ ప్రకటనతో తమిళ సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇటీవల ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్, త్వరలోనే ‘జైలర్–2’తో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ సినిమా తర్వాత రజనీ నుంచి వచ్చే తదుపరి చిత్రం ఇదే కావడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Celebrations begin#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/abzvPfuEf9
— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2026
ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి చేపట్టనున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్‌కు సుందర్.సి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో శిబి చక్రవర్తికి ఈ గొప్ప అవకాశం దక్కింది. గతంలో ఆయన తెరకెక్కించిన ‘డాన్’, ‘డాక్టర్’ సినిమాలు భారీ విజయాలు సాధించడంతో, రజనీకాంత్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తలైవర్ 173 ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, కామెడీ టచ్‌తో రూపొందనుందని సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రజనీకాంత్–కమల్ హాసన్ కలయికలో వస్తున్న ఈ సినిమా సినీ అభిమానుల్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది.
Also Read: BCCI: బంగ్లాదేశ్ బౌలర్ కు బీసీసీఐ షాక్..
Rajinikanth: రజనీకాంత్ @173.. కొత్త సినిమాపై లేటెస్ట్ అప్డేట్
