Pushpa 2: ఇండియన్ బాక్సాఫీస్‌ను వణికించిన ‘పుష్పరాజ్’ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 16 నుంచి ‘పుష్ప 2: ది రూల్’ జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో, ఈ విడుదల కోసం అల్లు అర్జున్ స్వయంగా ప్రమోషన్స్‌కు హాజరవుతున్నారు. సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి కనిపించిన బన్నీ, ప్రస్తుతం టోక్యోకు చేరుకున్నట్లు సమాచారం. టోక్యోలోని హోటల్ గదిలో నుంచి నగర దృశ్యాలను చూపిస్తూ అల్లు అర్జున్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
LATEST 🚨: #AlluArjun has reached Tokyo & is all set to promote the INDIAN INDUSTRY HIT #Pushpa2 in Japan ❤️🔥#Pushpa2inJapan #AA22 pic.twitter.com/beWGvHctep
— sunny (@Bhanu90590) January 13, 2026
సినిమా విడుదల విషయానికి వస్తే… జపాన్‌లోని ప్రముఖ పంపిణీ సంస్థలు ‘గీక్ పిక్చర్స్’ మరియు ‘షోచికూ’ కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. అక్కడి ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) అనే టైటిల్‌ను ఉపయోగిస్తున్నారు. రష్మిక మందన్న ‘జాతర’ ఎపిసోడ్, ఫహాద్ ఫాసిల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ జపాన్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటాయని మేకర్స్ నమ్ముతున్నారు.
