Coolie: వావ్.. ఆ సినిమాకు వెళ్లి రండని టికెట్లిచ్చి మరీ ఉద్యోగులకు సెలవిచ్చిన సంస్థ

No fake sick leaves needed to watch Rajinikanth's Coolie on August 14. Company gives paid holiday and free tickets to all employees

No fake sick leaves needed to watch Rajinikanth's Coolie on August 14. Company gives paid holiday and free tickets to all employees

Coolie: తమిళ సినీ అగ్రనటుడు రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ఈ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మదురై కేంద్రంగా పనిచేస్తున్న “యూనో ఆక్వా కేర్” సంస్థ తమ ఉద్యోగులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ అందించింది. సినిమా విడుదల రోజున ఉద్యోగులకు సెలవు ఇచ్చి, ఉచితంగా సినిమా టికెట్లు కూడా ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.

ఈ ఆఫర్‌ కేవలం మదురైకే కాకుండా చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం వంటి ప్రాంతాల్లోని శాఖలకు కూడా వర్తిస్తుంది. అంతేకాక, సినిమా విడుదల రోజున ఆశ్రమాల్లో ఆహారం పంపిణీ చేయడం, విరాళాలు అందించడం, ప్రజలకు స్వీట్లు పంచడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.

సంస్థ విడుదల చేసిన ఈ సర్క్యులర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసి పలువురు నెటిజన్లు తమ సంస్థలను ట్యాగ్ చేస్తూ, “మాకూ ఇలాంటి సెలవు ఇవ్వండి” అంటూ సరదా పోస్టులు పెడుతున్నారు.

Also Read: Curry Puff: వ్యాక్.. అమ్మో కర్రీపఫ్ లో పాముపిల్ల

Coolie: వావ్.. ఆ సినిమాకు వెళ్లి రండని టికెట్లిచ్చి మరీ ఉద్యోగులకు సెలవిచ్చిన సంస్థ