Ganesh Chaturthi : సెప్టెంబర్ 7న ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం యాంటిలియాలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో నీతా అంబానీ తన కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి అద్భుతమైన చిత్రాలకు పోజులిచ్చింది. ఇది కొత్తగా పెళ్లయిన రాధిక మొదటి గణేష్ చతుర్థిని గుర్తు చేసింది. ఆమె తన సాంప్రదాయ రూపంతో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా, రాధిక సంక్లిష్టమైన జర్దోజీ-గోల్డ్ బార్డర్‌లతో అలంకరించిన రంగురంగుల పట్టు చీరను ధరించింది.
ఆమె చీరను మ్యాచింగ్ గోల్డ్ బ్లౌజ్‌తో జత చేసింది. రాజ హారము, చెవిపోగులు, మంగళసూత్రంతో తన రూపాన్ని పూర్తి చేసింది. నీతా అంబానీ ఊదారంగు చీరలో ఎప్పటిలాగే సొగసును వెదజల్లుతూ రాయల్ జ్యువెలరీని ధరించింది.
అంబానీ స్టార్-స్టడెడ్ గణేష్ చతుర్థి కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కాగా జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అంగరంగ వైభవంగా రాధిక మర్చంట్‌ను అనంత్ అంబానీ వివాహం చేసుకున్నారు.