Srinivasamangapuram: తెలుగు చిత్రసీమలో రా మరియు ఇంటెన్స్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి మరోసారి చర్చల్లో నిలిచారు. ‘RX 100’తో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ‘మహాసముద్రం’తో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ‘మంగళవారం’తో తన మార్క్‌ను మళ్లీ రుజువు చేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త హీరో పరిచయం కావడం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచింది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టమనేని తన తొలి సినిమాకే అజయ్ భూపతి లాంటి దర్శకుడు దొరకడం ఆశలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ ఖరారైంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది.
ఈ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు అధికారికంగా ఆవిష్కరించడం సినిమాకు అదనపు హైప్ తెచ్చింది. “Happy to unveil the first look of #SrinivasaMangapuram… Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut” అంటూ మహేశ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జయకృష్ణ ఫస్ట్ లుక్‌లో ఇంటెన్స్ ఆట్టిట్యూడ్‌తో కనిపించారు. మోటార్ సైకిల్‌పై దూసుకెళ్తూ చేతిలో గన్‌తో కనిపించిన షాట్ చూస్తే ఇది సాధారణ లవ్ స్టోరీ కాదని స్పష్టమవుతోంది. కళ్లలో ఆగ్రహం, బాడీ లాంగ్వేజ్‌లో కాన్ఫిడెన్స్, ఫ్రేమ్ మొత్తం రా ఫీలింగ్‌ను ఇచ్చే విధంగా ఉండటంతో ఇది అజయ్ భూపతి స్టైల్ అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Happy to unveil the first look of #SrinivasaMangapuram… 🤗🤗🤗
Wishing #JayaKrishnaGhattamaneni the very best on his debut.
A strong team and an interesting beginning… all the best to the entire team 👍🏻👍🏻👍🏻@DirAjayBhupathi #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran… pic.twitter.com/Iw5B67hltq— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2026
జయకృష్ణ కొత్త హీరో అయినప్పటికీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. పోస్టర్ చూస్తే పాత్రలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ షేడ్స్ కూడా ఉండనున్నాయని అర్థమవుతోంది.
షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో కీలక సీన్లు మరియు కొన్ని పాటలను చిత్రీకరించారు. మేకర్స్ ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్‌పై సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ‘శ్రీనివాస మంగాపురం’ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే వార్తలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
