Rajasaab: ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రానికి టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ మేరకు వచ్చే శుక్రవారం నుంచి జనవరి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్సుల్లో రూ.132 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి లభించింది. అలాగే జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్సుల్లో రూ.89 పెంపు చెల్లుబాటు కానుంది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కి ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ మరియు నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
