Shriya Saran: ఫేక్ వాట్సాప్ పై స్పందించిన నటి శ్రియ

Following Aditi Rao Hydari, Shriya Saran CONDEMNS a Fake WhatsApp Account Impersonating Her

Shriya Saran: ఇటీవల నటి అదితిరావు హైదరి పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి ఫోటోగ్రాఫర్లను మోసం చేసిన ఘటన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సమస్యను నటి శ్రియా శరణ్ కూడా ఎదుర్కొన్నారు. ఈ విషయం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

“ఈ వాట్సాప్ నంబర్ ఎవరిదో నాకు తెలియదు. దయచేసి ఇలాంటి ఫేక్ అకౌంట్లతో మాట్లాడి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. ఇలా జరుగడం నాకు చాలా బాధగా ఉంది. ఇది నేను కాదు, ఈ నంబర్‌ కూడా నాది కాదు. దురదృష్టకరంగా, నా పేరుతో నా సన్నిహితులకు, కలిసి పనిచేయబోయే వారికి ఈ వ్యక్తి మెసేజ్ చేస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి” అని శ్రియా పేర్కొన్నారు.

ఇలాగే, ఇటీవల అదితిరావు హైదరి కూడా తన ఫోటో, పేరు ఉపయోగించి ఫేక్ వాట్సాప్ అకౌంట్‌ను సృష్టించి ఫోటోగ్రాఫర్లను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. “నా పేరుతో ఫోటోను పెట్టుకొని ఫోటోషూట్ పేరుతో పలువురికి మెసేజ్‌లు చేస్తున్నట్టు తెలిసింది. నేను ఎప్పుడూ వ్యక్తిగత నంబర్‌ ద్వారా ఇలాంటి పనుల కోసం ఎవరినీ సంప్రదించను. నా టీమ్ ద్వారానే సంప్రదింపులు జరుగుతాయి. మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే మా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ arhconnect ద్వారా తెలియజేయండి” అని ఆమె తెలిపారు.

Also Read: Nayanthara: నయనతారకు కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చిన భర్త విఘ్నేష్

Shriya Saran: ఫేక్ వాట్సాప్ పై స్పందించిన నటి శ్రియ