Rajasaab: ఏంటీ ‘రాజాసాబ్’ తొలి రోజే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?

Expect over Rs 100 crore in global collections on Day 1 for The Raja Saab

Expect over Rs 100 crore in global collections on Day 1 for The Raja Saab

Rajasaab: మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రాజాసాబ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. జనవరి 9 ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు… మొత్తం టాలీవుడ్ ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకుల్లో బలమైన హైప్ క్రియేట్ చేశాయి. మొదట్లో మారుతిపై సందేహపడ్డ ఫ్యాన్స్ ఇప్పుడు “మారుతి అంటే మారుతే… గుడి కట్టాలి” అని ప్రశంసిస్తున్న స్థితి.

ఇదిలా ఉంటే… తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఏపీ టికెట్ ధరలపై ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ప్రభుత్వం పెయిడ్ ప్రీమియర్లకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రీమియర్ టికెట్ ధరను రూ.1000 (GSTతో కలిపి) గా నిర్ణయించింది.

సాధారణ టికెట్ ధరలు ఇలా:

✔ విడుదల రోజు నుంచి డే 1 నుండి డే 10 వరకూ:

• సింగిల్ స్క్రీన్స్ — రూ. 297.5
• మల్టీప్లెక్స్ — రూ. 377

డే 11 నుండి మళ్లీ స్టాండర్డ్ రేట్స్ అమల్లోకి:

• సింగిల్ స్క్రీన్స్ — రూ. 147.5
• మల్టీప్లెక్స్ — రూ. 177

సంక్రాంతి పండగకు ముందు 5 రోజుల ముందే రిలీజ్ అవుతున్న రాజాసాబ్ పండుగ బాక్స్ ఆఫీస్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు “వింటేజ్ డార్లింగ్”ను మళ్లీ చూడబోతున్నామని సంతోషపడుతున్నారు. పండక్కి పాజిటివ్ టాక్ వస్తే… కలెక్షన్లు ఊహించలేనంత భారీగా ఉండొచ్చని ఫిలింనగర్ చర్చ.

సంక్రాంతి అంటేనే సినిమాలకు గోల్డెన్ సీజన్. దానిని ప్రభాస్ సినిమా రెట్టింపు చేయనుందని అంచనా. దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో హారర్ ఎలిమెంట్స్‌ను మిళితం చేసి, కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా కథను ట్రీట్ చేసినట్లు సమాచారం. ఈసారి విజువల్స్, ప్రెజెంటేషన్, ప్రభాస్ లుక్ అన్నీ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయని టాక్.

ఈ చిత్రం ప్రముఖ నిర్మాతల సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతోంది. దీనివల్లనే ఇండస్ట్రీలో ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచే అవకాశముందని టీమ్ విశ్వాసంతో ఉంది.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రొడక్షన్ లో ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో చిత్రాన్ని మలిచారు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్స్ వేసారని, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని హారర్ మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ పార్ట్‌ను రామ్-లక్ష్మణ్, కింగ్ సోలొమన్ కొరియోగ్రాఫ్ చేశారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా SKN వ్యవహరిస్తున్నారు.

ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధ్ధి కుమార్ నటిస్తున్నారు. వీరి పాత్రలు సినిమాలో కీలక మలుపులకు కారణమవుతాయని ఇండస్ట్రీ టాక్. అదనంగా సంజయ్ దత్, బర్త్‌డే జరుపుకుంటున్న బొమన్ ఇరానీ మరియు మరిన్ని వెర్సటైల్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఇంకా రెండు రోజుల్లో థియేటర్లలో దుమ్ము దులిపేందుకు సిద్ధంగా ఉన్న రాజాసాబ్… పండగ బరిలో ఆడే మొదటి పెద్ద గుర్రమని సినిమారంగం చెబుతోంది.

Also Read: Flipkart Republic Day Sale: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఎప్పట్నుంచంటే..

Rajasaab: ఏంటీ ‘రాజాసాబ్’ తొలి రోజే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?