Divya Nagesh: పెళ్లి పీటలెక్కిన చిన్నప్పటి జేజమ్మ.. పెళ్లి ఫొటోలు చూశారా..?

Arundhati Child Artist Divya Nagesh Getting Married

Arundhati Child Artist Divya Nagesh Getting Married

Divya Nagesh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్‌బస్టర్ మూవీ **‘అరుంధతి’**ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క నటన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. అదే సినిమాలో చిన్ననాటి జేజమ్మగా కనిపించిన పాప దివ్య నాగేష్. ఆమె నటనకు గాను నంది అవార్డు బెస్ట్‌ చైల్డ్ ఆర్టిస్టుగా లభించింది. తర్వాత ‘సింగం పులి’, ‘అపరిచితుడు’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.

పెద్దయ్యాక కూడా కొన్ని సినిమాల్లో నటిగా కనిపించిన దివ్య తాజాగా తన జీవితంలో కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌తో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఆమె, ఆగస్టు 18న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కేవలం ఇరు కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫొటోలు అధికారికంగా షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

Arundhati Movie Child Artist Divya Nagesh Engagement Photos Viral (5)-1735974453

అలాగే దివ్య తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ స్టిల్స్, బ్యాచిలర్ పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి కూడా వైరల్ అవుతూ అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

Arundhati Movie Child Artist Divya Nagesh Engagement Photos Viral (2)-1735974453

Also Read: Hangover: రాత్రి తాగిన మందు మత్తు ఇంకా దిగలేదా.. ఇలా వదిలించుకోండి

Divya Nagesh: పెళ్లి పీటలెక్కిన చిన్నప్పటి జేజమ్మ.. పెళ్లి ఫొటోలు చూశారా..?