Amitabh: అభిమానుల అత్యుత్సాహం.. తృటిలో పెద్ద ప్ర‌మాదం

Amitabh Bachchan MOBBED by fans at Surat airport

Amitabh Bachchan MOBBED by fans at Surat airport

Amitabh: ఇటీవలి రోజుల్లో అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలబ్రిటీలు పడుతున్న ఇబ్బందులు పెరుగుతున్నాయి. నిధి అగర్వాల్, సమంత, విజయ్, తనూజ వంటి పలువురు స్టార్‌లు ఇప్పటికే ఫ్యాన్స్ వల్ల అసౌకర్యాలను ఎదుర్కొన్నారు. తాజాగా అదే పరిస్థితిని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అనుభవించాల్సి వచ్చింది.

సూరత్ విమానాశ్రయంలో బిగ్ బీని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఒక్కసారిగా జనసంద్రం ఏర్పడడంతో ఆయన తన కార్‌ వద్దకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు, విమానాశ్రయం ద్వారం వద్ద ఉన్న గ్లాస్‌పై అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో అది పగిలిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అమితాబ్ కొద్దిదూరంలో ఉండడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరోవైపు, ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వద్ద ప్రతి ఆదివారం అభిమానులను పలకరించడం అమితాబ్ గత ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్న ప్రత్యేక సంప్రదాయం. అయితే ఇటీవల అక్కడకు వచ్చిన అభిమానుల భారీ సంఖ్య, వారి నినాదాలు, ఉత్సాహం చూసి బిగ్ బీ భావోద్వేగానికి గురయ్యారు. జల్సా బయట చేరిన అభిమానుల ప్రేమను తాను ఊహించలేకపోయానని, ఆ అనుభూతి తనను ఆశ్చర్యంలో ముంచేసిందని ఆయన బ్లాగ్‌లో పంచుకున్నారు.

తనపై అభిమానులు చూపుతున్న ప్రేమను మాటల్లో చెప్పడం చాలా కష్టమని, తాను చేసిన పనులకన్నా అభిమానులు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నారనేది ఒక మిస్టరీలా అనిపిస్తోందని అమితాబ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి అచంచల అభిమాన భావోద్వేగం జీవితాంతం మర్చిపోలేనిదని, అది తనను ఎప్పటికప్పుడు వినయంగా ఉండేలా చేస్తుందని కూడా తెలిపారు.

జల్సా వద్ద చేరిన అభిమానుల్లో ఒకరు అభిషేక్ బచ్చన్ ఫోటోతో వచ్చిన పోస్టర్ పట్టుకుని ఆయన సినిమాలను ప్రశంసిస్తుండటం బిగ్ బీ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ, తండ్రిగా ఇది తనకు ఎంతో గర్వకారణమని, పిల్లలు గౌరవాన్ని తెచ్చినప్పుడు ఆ అనుభూతి ప్రత్యేకమై ఉంటుందని అమితాబ్ హృదయపూర్వకంగా చెప్పారు.

Also Read: PV Sindhu: మలేసియా ఓపెన్‌ సెమీస్‌లో సింధు ఓటమి

Amitabh: అభిమానుల అత్యుత్సాహం.. తృటిలో పెద్ద ప్ర‌మాదం